అమరావతి: ఆంధ్రప్రదేశ్లో కులాల మధ్య చిచ్చు పెట్టి అశాంతి సృష్టించాలని కొన్ని పార్టీలు తీవ్రంగా ప్రయత్నించాయని వైసీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ విజయ సాయిరెడ్డి ఆరోపించారు. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునుద్దేశించి పలు వ్యాఖ్యలు చేశారు. 'మొదట కులాల మధ్య చిచ్చు పెట్టి అశాంతి సృష్టించాలని చూశారు. ప్రజలు చైతన్యవంతులై వీళ్లు రెచ్చగొట్టే ప్రయత్నాలను ఈసడించుకోవడంతో ఇప్పుడు మతం పేరిట ప్రజలను చీల్చాలని కంకణం కట్టుకున్నారు. రాజకీయంగా ఎదుర్కొనే దమ్ములేక ఎల్లో మీడియా, పార్టనర్లిద్దరూ రోజుకో రకంగా విషం చిమ్ముతున్నారు. కిరసనాయిలు మాటలు, రాతలు చూస్తుంటే ఆయనకు ఆరు నెలలుగా నిద్ర పడుతున్నట్టు లేదు. చంద్రబాబు పతనంతోనే అక్రమార్జన నిలిచి పోయింది. అసూయ, కడుపుమంట, మానసిక క్షోభతో మైండ్ కంట్రోల్ తప్పినట్టుంది. ఇంగ్లీష్ మీడియం మతం మార్చటానికట! పేద పిల్లలను చదువుకోనిచ్చేలా లేరని' విజయ సాయిరెడ్డి మండిపడ్డారు.