నాలుక మడత పెట్టడంలో తండ్రిని మించి పోయాడు..!

Fri,November 8, 2019 04:00 PM

అమరావతి: పది వేల లోపు డిపాజిట్ చేసి మోస పోయిన 3.7 లక్షల మంది అగ్రిగోల్డ్ బాధితులకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నిధులు పంపిణీ చేసి ప్రజా సంకల్ప యాత్రలో ఇచ్చిన మాట నిలుపుకున్నారు. మీకిది కనిపించట్లేదా చంద్రబాబు. కుక్కలను ఉసిగొల్పి మొరిగించే బదులు ఇలాంటి మంచి పనులను ప్రశంసిస్తే హుందాగా ఉంటుందని వైసీపీ ఎంపీ విజయ సాయిరెడ్డి విమర్శించారు. ట్విటర్లో పలు అంశాలపై తీవ్రస్థాయిలో స్పందించారు.


'మీ పిల్లల్ని మాత్రం ఇంగ్లిష్ మీడియంలోనే చదివిస్తారు. పేద పిల్లలు మాత్రం తెలుగులోనే చదవాలి. వాళ్లు ఉన్నత స్థాయికి ఎదగ కూడదు. విదేశాల్లో ఉన్నత చదువులకు వెళ్ల కూడదని కళ్లల్లో నిప్పులు పోసుకుంటున్నారు తండ్రీ కొడుకులు. దేవాన్ష్ ను తెలుగుమీడియంలో చదివిస్తామని చెప్పండి చూద్దాం?. స్కూళ్ళలో చైనీస్, జపనీస్ భాషలను కూడా నేర్పించాలని చంద్రబాబు వకాల్తా పుచ్చుకున్న విషయం మాలోకానికి తెలిసి ఉండదు. ఎవరైనా పాత వీడియోలు చూపించి కాబోయే పార్టీ అధ్యక్షుడికి జ్ణానం ప్రసాదించండి కాస్త. నాలుక మడత పెట్టడంలో తండ్రిని మించి పోయాడు. మానసిక పరిణితి లేని సొంత పుత్రుడు, దత్త పుత్రుడిని, కుల మీడియాను ప్రజల మీదకు వదిలాడు చంద్రబాబు. ఎవరు ఏం వాగుతున్నారో, ఎందుకు మాట్లాడుతున్నారో వాళ్లకే అర్థం కాని పరిస్థితి. ఎన్నికల్లో ప్రజల చేతిలో చావు దెబ్బలు తిన్న తర్వాత కూడా బాబు & కంపెనీకి బుద్ధి రాలేదని' విజయ సాయిరెడ్డి మండిపడ్డారు.

2076
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles