ఎడ్ల పందాలను ప్రారంభించిన సీఎం జగన్‌

Tue,January 14, 2020 05:53 PM

కృష్ణా: గుడివాడలో మంత్రి కొడాలి నాని ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలు నిర్వహించారు. గుడివాడ లింగవరం రోడ్‌ కె కన్వెన్షన్‌లో సంబరాలు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. సంక్రాంతి వేడుకలకు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి హాజరయ్యారు. చిన్నారులకు భోగిపళ్లు పోసి ఆశీర్వదించారు. అక్కడ ఏర్పాటు చేసిన బొమ్మల కొలువును తిలకించారు. జాతీయ స్థాయి ఒంగోలు ఎద్దుల బండలాగుడు పోటీలను ప్రారంభించిన జగన్‌.. అనంతరం మంత్రులు నాని, వెల్లంపల్లి శ్రీనివాస్‌, ఎంపీ బాలశౌరితో కలిసి ఎడ్ల పోటీలను తిలకించారు. ఈ వేడుకలను చూసేందుకు ప్రజలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.

727
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles