బన్నీ ఉత్సవం రక్తసిక్తం

Wed,October 9, 2019 08:29 AM

కర్నూలు: దేవరగట్టు.. ఈ పేరు వినగానే ముందుగా బన్ని రోజు జరిగే కర్రల సమరం గుర్తుకు వస్తుంది. ఈ సారి మాళ మల్లేశ్వరస్వామి ఉత్సవాలు ఆద్యంతం ఉత్కంఠ భరితంగా సాగాయి. బన్నీ ఉత్సవం సందర్భంగా ఉత్సవమూర్తులను ఊరేగింపుగా తీసుకువెళ్లే సమయంలో భక్తులు కర్రలతో తలపడటంతో మంగళవారం అర్ధరాత్రి జరిగిన సమరం రక్తసిక్తమైంది. కర్రల సమరంలో లక్ష మందికి పైగా ప్రజలు పాల్గొన్నారు. 70 మందికి పైగా గాయాలు కాగా నలుగురి పరిస్థితి విషమంగా ఉంది. మాళ మల్లేశ్వరుల విగ్రహాలను దక్కించుకునేందుకు భక్తులు పోటీపడ్డారు. 11 గ్రామాల ప్రజలు రెండు గ్రూపులుగా విడిపోయి కర్రలతో కొట్టుకున్నారు. ఈ ఉత్సవాల్లో గాయపడ్డ వారికి ప్రత్యేక వైద్య శిబిరంలో ప్రథమ చికిత్స అందించారు. విజయదశమి సందర్భంగా స్వామి కల్యాణోత్సవం అనంతరం కర్రల సమరం జరిగింది.1865
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles