తిరుమలలో భారీగా పెరిగిన భక్తుల రద్దీ

Wed,October 9, 2019 09:00 AM

తిరుపతి: తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో భక్తుల రద్దీ భారీగా పెరిగింది. శ్రీవారి సర్వదర్శనానికి 24 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. సాధారణ సర్వదర్శనానికి 14 గంటల సమయం, టైమ్‌స్లాట్ టోకెన్లు పొందిన భక్తులకు 4 గంటల సమయం పడుతోంది. దసరా పండుగ సందర్భంగా నిన్న శ్రీవారిని 94,147 మంది దర్శించుకున్నారు. 29,305 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. నిన్న శ్రీవారి హుండీ ఆదాయం రూ.2.20కోట్లు వచ్చిందని టీటీడీ అధికారులు వెల్లడించారు. దసరా సెలవులు కావడంతో భక్తులు భారీ సంఖ్యలో శ్రీవారి దర్శనానికి తరలివస్తున్నారు.

657
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles