చంద్రబాబు నివాసానికి వరద ముప్పు!

Wed,August 14, 2019 12:24 PM

Flood threat to Chandrababu residence at Krishna River

హైదరాబాద్‌ : కృష్ణా నది ఉగ్రరూపం దాల్చడంతో ఆంధ్రప్రదేశ్‌ మాజీ సీఎం చంద్రబాబు నివాసానికి వరద ముప్పు పొంచి ఉంది. కృష్ణా నదిలో వరద పోటెత్తడంతో ఉండవల్లిలోని చంద్రబాబు నివాసం వద్ద కూడా వరద గంటగంటకు పెరుగుతోంది. కృష్ణా నది కరకట్టపై చంద్రబాబు ఇల్లు నిర్మించుకున్న విషయం తెలిసిందే. చంద్రబాబు నివాసంలోకి వరద నీరు రాకుండా ఉండేందుకు సిబ్బంది చర్యలు తీసుకుంటున్నారు. బాబు కాన్వాయ్‌ను హ్యాపీ రిసార్ట్స్‌కు తరలించారు. ఇంటి వెనుకవైపు ఇసుక బస్తాలు వేసి వరద నీటిని అడ్డుకుంటున్నారు. ఇంట్లో కింది భాగంలో ఉన్న వస్తువులన్నింటినీ మేడపైకి తీసుకెళ్తున్నారు. అయితే చంద్రబాబు ప్రస్తుతం ఆ నివాసంలో లేరు. ప్రకాశం బ్యారేజీకి 4 లక్షల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తుంది. దీంతో కృష్ణా కరకట్ట వైపు ఉన్న నివాసాలు ముంపునకు గురవుతున్నాయి. ప్రకాశం బ్యారేజీ 70 గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు.

3908
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles