సిర్పూర్(టీ), జూలై 1 : వెంకట్రావ్‌పేట్ గ్రామంలో ఓ మూడేళ్ల చిన్నారిపై లైంగిక దాడి జరిగిందన్న ఆరోపణల నేపథ్యంలో కాగజ్‌నగర్ డీఎస్పీ కరుణాకర్ ఆధ్వర్యంలో సోమవారం విచారణ ప్రారంభించారు. వెంకట్రావ్‌పేట్ గ్రామానికి చెందిన యువకుడు బుడే రాజేందర్ ఆదివారం(జూన్ 30) మధ్యాహ్నం ఆరుబయట ఆడుకుంటున్న తన కూతురును ఇంటికి ఎత్తుకెళ్లి లైంగిక దాడి చేశాడని బాలిక తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
ఈ మేరకు రాజేందర్‌ను అదుపులోకి దర్యాప్తు చేస్తున్నారు. సిర్పూర్(టీ) కోర్టులో హాజరుపరుచగా, న్యాయమూర్తి రిమాండ్ విధించినట్లు డీఎస్పీ తెలిపారు.