మంచిర్యాలటౌన్, జూన్ 28: బ్యాడ్మింటన్ క్రీడాకారులు జాతీయ స్థాయిలో రాణించి జిల్లాకు పేరు తీసుకురావాలని మంచిర్యాల జిల్లా జడ్పీ చైర్ పర్సన్ నల్లల భాగ్యలక్ష్మి అన్నారు. శుక్రవారం మంచిర్యాల పట్టణంలోని గ్రీన్సిటీలోగల మాస్టర్స్ బ్యాడ్మింటన్ అకాడమీలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న యూనిక్స్ సన్ రైస్ సీనియర్స్ మెన్ అండ్ ఉమెన్ రాష్ట్రస్థాయి బ్యాడ్మింటన్ పోటీలను ఆమె లాంఛనంగా ప్రారంభించారు. ఆమె మాట్లాడుతూ క్రీడలతో ఉద్యోగావకాశాల్లో ప్రత్యేక కోటా ఉంటుందన్నారు. డీఎఫ్‌వో శివ ఆశిష్ మాట్లాడుతూ బ్యాడ్మింటన్ క్రీడాకారులకు మంచి భవిష్యత్తు ఉందని, మన క్రీడాకారులు ప్రపంచ స్థాయిలో మంచి ఫలితాలు సాధిస్తున్నారని తెలిపారు.
మాజీ విప్ నల్లాల ఓదెలు మాట్లాడుతూ తనకు క్రీడలంటే ఎంతో ఇష్టమని, తాను స్వయంగా క్రీడాకారుడినేనని అన్నారు. మంచిర్యాలలో నిర్వహించే టోర్నమెంట్లకు తనవంతు సహకారమందిస్తానని అన్నారు. మంచిర్యాల మున్సిపల్ చైర్మన్ ఉప్పలయ్య మాట్లాడుతూ మంచిర్యాలలో క్రీడలు నిర్వహించే వారికి అన్ని విధాలా సహాయ సహకారాలు అందిస్తామన్నారు. మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్‌సాగర్‌రావు మంచిర్యాల పట్టణంలో అన్ని క్రీడలకు ఉపయోగపడేలా పెద్ద స్టేడియాన్ని నిర్మించేందుకు ప్రణాళిక చేస్తున్నారని తెలిపారు. రాష్ట్ర బ్యాడ్మింటన్ సంఘం జాయింట్ సెక్రటరీ బాబు మాట్లాడుతూ మంచిర్యాలలో యేటా బ్యాడ్మింటన్ రాష్ట్ర పోటీలను నిర్వహిస్తున్నారని, ఇది అభినందించదగ్గ విషయమన్నారు. టోర్నమెంట్ కన్వీనర్ గాజుల ముఖేశ్ గౌడ్ మాట్లాడుతూ అందరి సహకారంతో రాష్ట్రస్థాయి బ్యాడ్మింటన్ పోటీలు నిర్వహిస్తున్నామని చెప్పారు.
ఈ కార్యక్రమంలో విద్యుత్ శాఖ ఎస్ఈ శ్రావణ్‌కుమార్, వాలీబాల్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు నల్ల శంకర్, బ్యాడ్మింటన్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ భాసర్ల వాసు, టోర్నమెంట్ ఆర్గనైజింగ్ సెక్రటరీ పుల్లూరు సుధాకర్. ఎస్సీ కార్పొరేషన్ ఈడీ దుర్గ ప్రసాద్, డీవైఎస్వో రాజు వీర్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు పూదర్ తిరుపతి, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు తూముల నరేశ్, బ్యాడ్మింటన్ అసోసియేషన్ ట్రెజరర్ సత్యపాల్ రెడ్డి, వైస్ ప్రెసిడెంట్ మీనా రెడ్డి, జాయింట్ సెక్రటరీలు రమేశ్‌రెడ్డి, మధు, కార్యవర్గ సభ్యులు లక్ష్మీనారాయణ, హర్ష, రాజలింగు, కృష్ణ, టోర్నమెంట్ రిఫరీ మల్లికార్జున్, టెక్నికల్ కమిటీ చైర్మన్ టీసీఎస్ రావు, జాయింట్ సెక్రటరీ మనోజ్, రిఫరీ మల్లికార్జున్, మ్యాచ్ కంట్రోల్ కుమార్, ఎంపైర్లు, ఫిజికల్ డైరెక్టర్లు, తదితరులు పాల్గొన్నారు.