Apps:
Follow us on:

Sakshi Vaidya | లాక్‌డౌన్‌లో ఆ పని చేయడం వల్లే పాపులర్‌ అయ్యా: సాక్షి వైద్య

Sakshi Vaidya
2/13Sakshi Vaidya | ‘ఏజెంట్‌’ (Agent) చిత్రం ద్వారా తెలుగు చిత్రసీమలోకి అరంగేట్రం చేస్తున్నది సాక్షివైద్య (Sakshi Vaidya).
3/13తొలి చిత్రం ద్వారానే పర్‌ఫార్మెన్స్‌కు ప్రాధాన్యం కలిగిన పాత్ర దొరకడం అదృష్టంగా భావిస్తున్నానని చెప్పింది.
4/13అక్కినేని అఖిల్ (Akhil Akkineni) కథానాయకుడిగా సురేందర్‌ రెడ్డి (Surender Reddy) దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం నేడు ప్రేక్షకుల ముందుకురానుంది.
5/13ఈ సందర్భంగా గురువారం ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో సాక్షివైద్య (Sakshi Vaidya) మాట్లాడుతూ ‘నా స్వస్థలం ముంబయి.
6/13లాక్‌డౌన్‌ సమయంలో ఖాళీగా ఉండలేక కొన్ని రీల్స్‌ చేశాను. అవి చాలా పాపులర్‌ అయ్యాయని సాక్షివైద్య (Sakshi Vaidya) తెలిపారు.
7/13ఫ్రెండ్స్‌ సలహాతో ముంబయిలో కొన్ని ఆడిషన్స్‌ ఇచ్చాను. అయితే బాలీవుడ్‌లో వచ్చిన అవకాశాలు నచ్చక అంగీకరించలేదు.
8/13‘ఏజెంట్‌’ (Agent) కథ చాలా కొత్తగా అనిపించడంతో వెంటనే ఒప్పుకున్నా. ‘ఏజెంట్‌’ (Agent) యాక్షన్‌ థ్రిల్లర్‌ అయినా అందమైన ప్రేమకథ ఉంటుంది.
9/13ఇందులో నేను ఏజెంట్‌ ప్రేయసిగా నటించా. ఆయన ఆపరేషన్‌లో పాలుపంచుకుంటూ నా పాత్ర ఆద్యంతం ఆసక్తికరంగా సాగుతుంది.
10/13నేను భరతనాట్య నేపథ్యం నుంచి రావడం వల్ల డ్యాన్స్‌ కోసం అంతగా కష్టపడలేదు. అఖిల్‌ (Akhil Akkineni) చాలా మృదుస్వభావి.
11/13సహనటులకు చాలా మర్యాదనిస్తారు. ఆయన ద్వారా తెలుగు మాట్లాడటం నేర్చుకున్నా. తెలుగులో మరిన్ని మంచి అవకాశాల కోసం ఎదురుచూస్తున్నా.
12/13వరుణ్‌తేజ్ (Varun Tej)తో ఓ సినిమా కన్‌ఫర్మ్‌ అయింది’ అని సాక్షివైద్య (Sakshi Vaidya) చెప్పింది.
13/13Sakshi Vaidya At Agent Movie Interview