ప్రాణహితలో పడవ మునక

Mon,December 2, 2019 03:00 AM

-ఇద్దరు ఎఫ్‌బీవోల గల్లంతు
-మరొక ఎఫ్‌బీవోతోపాటు ముగ్గురు స్థానికులు క్షేమం
-సహాయక చర్యలకు మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి ఆదేశం
-సాయంత్రంవరకు గాలించినా లభించని ఆచూకీ
-నేడు మళ్లీ గాలింపు

హైదరాబాద్, నమస్తే తెలంగాణ/కౌటాల రూరల్ (చింతలమానెపల్లి): కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా చింతలమానెపల్లి మండలం గూడెం సమీపంలోని (మహారాష్ట్ర సరిహద్దులో) ప్రాణహిత నదిలో ఆదివారం నాటుపడవ మునిగి ఇద్దరు ఫారెస్ట్ బీట్ అధికారులు (ఎఫ్‌బీవో) గల్లంతయ్యారు. స్థానికులు, పోలీసుల కథనం ప్రకారం.. విధి నిర్వహణలో భాగంగా కర్జెల్లి అటవీ ప్రాంతం పరిధిలోని కేతిని బీట్ అధికారి బాలకృష్ణ, చిత్తా బీట్ అధికారి సురేశ్, శివపెల్లి బీట్ అధికారి సద్దాం మహారాష్ట్ర సరిహద్దులోని అహేరికి నాటుపడవలో వెళ్లారు.
PranhitaRiver1
నది పరీవాహక ప్రాంతాన్ని పరిశీలించి తిరిగి బయల్దేరారు. వీరితోపాటు స్థానికులైన పడవ నడిపే పానెం లింగయ్య, సూర కత్తెరయ్య, పేదం అంజయ్య కూడా ఉన్నారు. ప్రాణహిత మధ్యలోకి వచ్చేసరికి పడవ ప్రమాదవశాత్తు మునిగిపోయింది. ఈ ఘటనలో బీట్ ఆఫీసర్లు బాలకృష్ణ, సురేశ్ గల్లంతవగా, మిగతా నలుగురు ప్రాణాలతో బయటపడ్డారు. విషయం తెలుసుకున్న కాగజ్‌నగర్ డీఎస్పీ బీఎల్‌ఎన్ స్వామితోపాటు కాగజ్‌నగర్ ఎఫ్‌డీవో విజయ్‌కుమార్, మహారాష్ట్ర పోలీసులు ఘటనాస్థలికి చేరుకున్నారు. మహారాష్ట్ర నుంచి వచ్చిన రెస్క్యూ సిబ్బంది సాయంత్రం వరకు గాలింపు చర్యలు చేపట్టినప్పటికీ ఆచూకీ లభించలేదు.

సోమవారం తిరిగి మళ్లీ గాలిం పు చర్యలు ముమ్మరం చేయనున్నట్టు పోలీస్ అధికారులు చెప్పారు. విషయం తెలుసుకున్న బాధిత కుటుంబసభ్యులు ఘటనాస్థలికి చేరుకొని రోదించడం అందరినీ కలిచివేసింది. అట వీ, పర్యావరణశాఖల మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి ఘటనపై పీసీసీఎఫ్ ఆర్ శోభ, సీసీఎఫ్ వినోద్, జిల్లా ఎస్పీ మల్లారెడ్డితో ఫోన్‌లో మాట్లాడారు. పూర్తి సహాయ చర్యలు చేపట్టాలని ఎస్పీని ఆదేశించారు. కాగా, గల్లంతైన ఇద్దరు ఎఫ్‌బీవోలు మూడు నెలల క్రితమే విధుల్లోచేరారు.
PranhitaRiver2

1723
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles