దేశాభివృద్ధిలో ఇంజినీర్ల పాత్ర కీలకం

Mon,September 16, 2019 01:44 AM

-ట్రిపుల్‌ఐటీ వీసీ అశోక్‌కుమార్
-ఘనంగా ఇంజినీర్స్ డే
-విద్యార్థులు ఆవిష్కరించిన ఎలక్ట్రికల్ బైక్, సోలార్ కారు

బాసర: దేశాభివృద్ధిలో ఇంజినీర్ల పాత్ర కీలకమని బాసర ట్రిపుల్‌ఐటీ వైస్ చాన్స్‌లర్ అశోక్ కుమార్ అన్నారు. ఆదివారం నిర్మల్ జిల్లా బాసరలోని ట్రిపుల్ ఐటీలో ఇంజినీర్స్ డేను ఘనంగా నిర్వహించారు. తొలుత వీసీ, డీఆర్‌డీఎల్ ఎన్‌డీఈ హెచ్‌వోడీ వెంకట్‌రెడ్డి కార్యక్రమాన్ని ప్రారంభించారు. విద్యార్థులు రూపొందించిన సోలార్ కారు, ఎలక్ట్రికల్ బైక్‌ను వీసీ ఆవిష్కరించారు. స్వయంగా బైక్ నడిపి విద్యార్థులను ఉత్తేజపరిచారు. ఇంజినీర్స్ జేఏసీ, హైదరాబాద్ ఇంజినీర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆదివారం జలసౌధలో ఇంజినీర్స్ డేను ఘనంగా నిర్వహించారు. నీటిపారుదలశాఖ ఈఎన్సీ మురళీధర్‌రావు, ఈఎన్సీ హరిరాం తదితరులు పాల్గొన్నారు.

133
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles