మేడ్చల్‌లో పాముల సంరక్షణ కేంద్రం

Mon,September 16, 2019 01:50 AM

బౌరంపేట్ రిజర్వు ఫారెస్ట్‌లో ఏర్పాటుచేస్తున్న ప్రభుత్వం
మేడ్చల్ జిల్లా, నమస్తే తెలంగాణ ప్రతినిధి: పర్యావరణ సమతుల్యతను కాపాడటంలో ముఖ్యపాత్ర పోషించే పాములను సంరక్షించేందుకు తెలంగాణ ప్రభుత్వం చర్యలు తీసుకొంటున్నది. రాష్ట్ర అటవీశాఖ ఆధ్వర్యంలో హైదరాబాద్ శివారు మేడ్చల్ జిల్లా పరిధిలోని బౌరంపేట్ రిజర్వు ఫారెస్ట్‌లో రూ.1.30 కోట్లతో సర్పాల సంరక్షణ కేంద్రాన్ని ఏర్పాటుచేస్తున్నారు. ఈ కేంద్రం నిర్మాణం పనులు స్లాబ్ దశలో ఉన్నాయని, త్వరలోనే అందుబాటులోకి వస్తుందని జిల్లా అటవీ అధికారి సుధాకర్‌రెడ్డి నమస్తే తెలంగాణకు చెప్పారు. రాష్ట్రంలోనే తొలిసారిగా ఏర్పాటుచేస్తున్న ఈ కేంద్రంలో రాష్ట్రవ్యాప్తంగా పట్టుకొన్న పాములను సంరక్షిస్తామని, అలాగే వివిధ రకాల పాములను చూసేందుకు వీలుగా ఏర్పాట్లుచేస్తున్నట్టు తెలిపారు. ఏటా ఐదు వేల నుంచి ఎనిమిది వేల పాములను చంపేస్తుండగా.. పాముకాటు కారణంగా దేశంలో ఏటా 50 వేల మంది చనిపోతున్నారని అధికారిక లెక్కలు చెప్తున్నాయి. పాముల సంఖ్య తగ్గి ఎలుకలు, కప్పల సంఖ్య క్రమంగా పెరుగుతుండటంతో పర్యావరణ సమతుల్యత దెబ్బతింటున్నదని అధికారులు పేర్కొంటున్నారు. పాములను రక్షించి పర్యావరణాన్ని కాపాడాలన్న ఉద్దేశంతో ఈ కేంద్రాన్ని ప్రభుత్వం నెలకొల్పుతున్నది.
SNAKS-RESCUE2

468
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles