శాంతించిన కృష్ణమ్మ

Sun,September 15, 2019 03:08 AM

-ఎగువన జూరాల నుంచి శ్రీశైలానికి తగ్గిన ఇన్‌ఫ్లో
-ఉదయం పది గేట్లు ఎత్తివేత.. సాయంత్రానికి ఆరుకు తగ్గింపు
-నాగార్జునసాగర్ 14 క్రస్ట్ గేట్ల నుంచి నీటివిడుదల
-గోదావరిలో పెరిగిన వరద ప్రవాహం
-భద్రాచలం వద్ద నీటిమట్టం 32.6 అడుగులు

హైదరాబాద్/నాగర్‌కర్నూల్ ప్రతినిధి/ జోగుళాంబ గద్వాల జిల్లా ప్రతినిధి/నందికొండ/భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రతినిధి/మెండోరా, నమస్తే తెలంగాణ: కృష్ణమ్మ కొంత శాంతించింది. ఎగువ నుంచి వరద తగ్గుముఖం పట్టింది. ఆల్మట్టికి నీటి ప్రవాహం గణనీయంగా తగ్గింది. నారాయణపుర జలాశయానికి కూడా మధ్యాహ్నం 80 వేల క్యూసెక్కుల వరద వస్తుండగా సా యంత్రానికి అది 15 వేలకు చేరింది. దాదాపు జలాశయం నుంచి దిగువకు నీటి విడుదల నిలిచిపోయింది. ఉజ్జయిని నుంచి మాత్రం స్థిరంగా 40 వేల క్యూసెక్కుల అవుట్‌ఫ్లో కొనసాగుతున్నది. దిగువన జూరాల జలాశయానికి క్రమంగా వరద తగ్గుముఖం పడుతున్నది. తుంగభద్ర నుంచి అవుట్‌ఫ్లో కూడా క్రమంగా తగ్గుతున్నది. ఎగువన జూరాల నుంచి శ్రీశైలం ప్రాజెక్ట్‌కు ఇన్‌ఫ్లో తగ్గింది. శుక్రవారం శ్రీశైలం పది గేట్లతో నీటిని విడుదలచేయగా శనివారం నాటికి ఆరు గేట్ల ద్వారా నీటిని కిందికి వదులుతున్నారు. శ్రీశైలం నుంచి నాగార్జునసాగర్‌కు ఇన్‌ఫ్లో కొనసాగుతుండటంతో శనివారం ఉదయం 14 క్రస్ట్ గేట్ల ద్వారా నీటిని విడుదల చేశారు. మధ్యాహ్నం వరకు 10 గేట్లను ఎత్తి నీటిని దిగువకు విడుదలచేసిన అధికారులు సాయంత్రం ఇన్‌ఫ్లో పెరుగడంతో మరో నాలుగు గేట్లను ఎత్తారు.

గోదావరిలో పెరిగిన వరద

గోదావరిలో వరద ఉధృతి మాత్రం బాగానే కొనసాగుతున్నది. పెరూరు దగ్గర శుక్రవారం కంటే కాస్త పెరిగి ఏడున్నర లక్షల క్యూసెక్కుల వరకు ప్రవాహం కొనసాగుతున్నది. శ్రీరాంసాగర్‌కు 19 వేల క్యూసెక్కుల నుంచి స్వల్పంగా తగ్గి 15 వేల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో నమోదవుతున్నది. శ్రీరాజరాజేశ్వర జలాశయం నుంచి 3,310 క్యూసెక్కుల అవుట్‌ఫ్లో.. ఇదే క్రమంలో లోయర్ మానేరుకు 2,597 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో నమోదవుతున్నది. కడెం కు స్వల్పంగా 866 క్యూసెక్కులు, ఎల్లంపల్లికి 1,814 క్యూసెక్కుల వరద వస్తున్నది.

SRISAILAM

తాలిపేరు రెండు గేట్లు ఎత్తివేత

భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం శనివారం 32.6 అడుగుల వద్ద నిలకడగా ఉన్నది. చర్ల మండలంలోని మధ్యతరహా నీటి ప్రాజెక్టు అయిన తాలిపేరు ప్రాజెక్టుకు శనివారం వరద పోటెత్తింది. అప్రమత్తమైన ఇరిగేషన్ అధికారులు ప్రాజెక్టు రెండు గేట్లు ఎత్తి 5,924 క్యూసెక్కుల నీటిని దిగువకు వదిలారు. పాల్వంచ మండలంలోని కిన్నెరసాని రిజర్వాయర్‌లోకి భారీగా వరదనీరు వచ్చి చేరుతున్నది.
projects

633
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles