విద్యార్థుల్లోని జిజ్ఞాసను వెలికితీయాలి

Mon,September 16, 2019 01:47 AM

-పాఠశాల స్థాయినుంచే ఆవిష్కరణలకు శ్రీకారం చుట్టాలి
-రాష్ట్రస్థ్ధాయి సైన్స్‌కాంగ్రెస్‌లో మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్

ఖమ్మం ఎడ్యుకేషన్: విద్యార్థుల్లో దాగి ఉన్న జిజ్ఞాసను వెలికితీసేందుకు సైన్స్ కార్యక్రమా లు దోహదపడుతాయని రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ అన్నారు. ఆదివారం ఖమ్మంలోని హార్వెస్ట్ పాఠశాలలో రాష్ట్రస్థాయి జాతీయ బాలల సైన్స్ కాంగ్రెస్ సదస్సును ఆయన ప్రారంభించి ప్రసంగించారు. పాఠశాల స్థాయి నుంచే విద్యార్థులు సైన్స్‌పై మక్కువ పెంచుకుని సమాజానికి ఉపయోగపడే ఆవిష్కరణలకు శ్రీకారం చుట్టాలని పిలుపునిచ్చారు. విద్యార్థులు సాంకేతిక పరిజ్ఞానం అందిపుచ్చుకుంటూ వినూత్నంగా ఆలోచిస్తూ ఉత్తమ ప్రాజెక్ట్‌లు రూపొందించాలని కోరారు. కార్యక్రమంలో కలెక్టర్ కర్ణన్, జెడ్పీ చైర్మన్ లింగాల కమల్‌రాజు, జాతీయ బాలల సైన్స్ కాంగ్రెస్ పరిశీలకురాలు గీతా స్వామినాధన్, టీఎస్ కాస్ట్ పులి రవికుమార్, డీఈవో మదన్‌మోహన్ తదితరులు పాల్గొన్నారు.

169
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles