టీచర్లకు త్వరలో పదోన్నతులు


Fri,July 26, 2019 01:50 AM

Promotions to teachers soon

-దాదాపు 15 వేల మందికి ప్రయోజనం
-పాత.. కొత్త జిల్లాల స్పష్టతపై కసరత్తు
-పాఠశాల విద్యాశాఖ కమిషనర్ టీ విజయ్‌కుమార్
హైదరాబాద్, నమస్తే తెలంగాణ: ప్రభుత్వ, జిల్లా పరిషత్ పాఠశాలల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులకు వీలైనంత త్వరలోనే పదోన్నతులు కల్పించాలని పాఠశాల విద్యాశాఖ ఉన్నతాధికారులు కసరత్తు మొదలుపెట్టారు. అంతర్గతంగా పాత జిల్లాలు, కొత్త జిల్లాలవారీగా సీనియారిటీ జాబితాలు సిద్ధంచేస్తున్నట్లు చెప్తున్నారు. పదోన్నతులను పాత జిల్లాలవారీగా కల్పించాలా.. కొత్త జిల్లాలవారీగా కల్పించాలా అనే అంశంపై స్పష్టత కోసం ప్రభుత్వం కసరత్తు చేస్తున్నట్లు పాఠశాల విద్యాశాఖ కమిషనర్ టీ విజయ్‌కుమార్ తెలిపారు. ప్రస్తుతం రాష్ట్రంలో 33 జిల్లాలు ఏర్పాటయ్యాయి. జిల్లాలకు కేంద్రం నుంచి ఆమోదం రావాల్సి ఉన్నదని, ఆ తర్వాత స్థానిక పరిస్థితుల ఆధారంగా పదోన్నతుల అంశాన్ని పరిశీలిస్తామని తెలిపారు. రాష్ట్రంలో ఏడేండ్లుగా ఉపాధ్యాయులకు పదోన్నతులు లేవు, ఉపాధ్యాయ సంఘాల నాయకుల నుంచి, ఉపాధ్యాయ ఎమ్మెల్సీల నుంచి విజ్ఞప్తులు వస్తున్నాయని, వాటిని పరిగణనలోకి తీసుకుని పదోన్నతులు కల్పించడానికి ఏర్పాట్లుచేస్తున్నట్టు చెప్పారు. దాదాపు 15 వేల మంది ఉపాధ్యాయులు పదోన్నతులు పొందే అవకాశం ఉన్నదని కమిషనర్ అభిప్రాయపడ్డారు.

194
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles