పారిశుద్ధ్య పనులను వేగవంతం చేయాలి

Sun,September 15, 2019 02:45 AM

ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్
స్టేషన్ మహబూబ్‌నగర్: పాలమూరు జిల్లాకేంద్రంలో పారిశుద్ధ్య పనులను వేగవంతం చేయాలని ఎక్సైజ్ శాఖ మంత్రి వీ శ్రీనివాస్‌గౌడ్ అధికారులను ఆదేశించారు. డెంగీ వ్యాధిపై అవగాహన ర్యాలీని శనివారం మహబూబ్‌నగర్ పట్టణంలో కలెక్టర్ రోనాల్డ్‌రోస్‌తో కలిసి మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పట్టణంలో డెంగీ నివారణకు ప్రత్యేక చర్యలు చేపడుతున్నట్టు తెలిపారు. ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేశామని, ప్రతి రోజూ ఇంటింటికి తిరిగి వివరాలు సేకరించడంతోపాటు ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. అనంతరం అశోక్ టాకీస్ చౌరస్తా వరకు పారిశుద్ధ్య పనులను పరిశీలించారు. రహదారులపై నిల్వ ఉన్న నీటిలో స్వయంగా మంత్రి శ్రీనివాస్‌గౌడ్ దోమల నివారణ మందు స్ప్రే చేశారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ సురేందర్, డీఎంహెచ్‌వో రజిని, జిల్లా మెడికల్ ఆఫీసర్ శశికాంత్, మలేరియా అధికారి విజయ్‌కుమార్, టీఆర్‌ఎస్ నాయకులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.

146
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles