లిక్కర్ షాపులకు నేడు లక్కీ డ్రా

Fri,October 18, 2019 03:06 AM

-2,216 మద్యం దుకాణాలకు 48,401 దరఖాస్తులు
-దరఖాస్తుల ద్వారా ప్రభుత్వానికి రూ.968 కోట్ల ఆదాయం
-అత్యధికంగా రంగారెడ్డి డివిజన్‌లో 422 షాపులకు 8,892 దరఖాస్తులు
-అత్యల్పంగా హైదరాబాద్‌లో 173 షాపులకు 1,499 దరఖాస్తులు

హైదరాబాద్, నమస్తే తెలంగాణ: రాష్ట్రంలో మద్యం దుకాణాల కేటాయింపు ప్రక్రియ తుది అంకానికి చేరుకున్నది. శుక్రవారం లక్కీ డ్రా ద్వారా 2,216 షాపులకు దుకాణాదారులను ఎంపికచేయనున్నారు. ఇందుకోసం అన్నిజిల్లాల్లో అధికారులు ఏర్పాట్లు పూర్తిచేశారు. మొత్తం 2,216 దుకాణాలకు 48,401 దరఖాస్తులు వచ్చినట్టు ఎక్సైజ్‌శాఖ కమిషనర్ సోమేశ్‌కుమార్ తెలిపారు. ప్రభుత్వానికి రూ.968.02 కోట్ల ఆ దాయం వచ్చినట్టు చెప్పారు. డివిజన్లవారీగా చూస్తే అత్యధికంగా రంగారెడ్డిలోని 422 మద్యం షాపులకు 8,892 దరఖాస్తులు వచ్చాయి. దీం తో ప్రభుత్వానికి రూ.177.84 కోట్ల ఆదాయం సమకూరింది. దరఖాస్తు ఫీజు రూ.2 లక్షలకు పెంచినప్పటికీ మద్యం దుకాణాలకు దరఖాస్తులు వెల్లువెత్తాయి. 2017లో దరఖాస్తుల ద్వారా రూ.412 కోట్ల ఆదాయం రాగా, ఈ ఏడాది రూ.968.02 కోట్లు సమకూరినట్టు అధికారులు తెలిపారు.

ఎనిమిది షాపుల డ్రా నిలిపివేత

నిజామాబాద్ జిల్లాలో ఐదు అంతకంటే తక్కువ దరఖాస్తులు వచ్చిన మద్యం షాపులకు డ్రా నిలిపివేయాలని ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు అందాయి. జిల్లాలో బోధన్ ఎక్సైజ్ స్టేషన్ పరిధిలో మూడు, ఆర్మూర్ పరిధిలో మూడు, నిజామాబాద్ పరిధిలోని రెండు షాపుల డ్రాను నిలిపివేయనున్నారు. వ్యాపారులు సిండికేటుకు పాల్పడ్డారన్న ఆరోపణల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిసింది.

డ్రాకు ఏర్పాట్లు పూర్తిచేశాం

మద్యం షాపుల ఎంపిక కోసం 34 కేంద్రాల్లో లక్కీ డ్రా తీసేందుకు ఏర్పాట్లు చేసినట్టు ఎక్సైజ్‌శాఖ కమిషనర్ సోమేశ్‌కుమార్ తెలిపారు. అన్నిజిల్లాల్లో కలెక్టర్ల ఆధ్వర్యంలో లక్కీ డ్రా తీయనున్నట్టు చెప్పారు. ఈ ఏడాదిదరఖాస్తుల సంఖ్య పెరిగిందన్నారు. నవంబర్ ఒకటి నుంచి నూతన మద్యం విధానం అమల్లోకి వస్తుందని చెప్పారు.
alcohol2

1931
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles