రోగులకు ప్రేమతో సేవ చేయండి

Sun,September 15, 2019 02:56 AM

-వైద్యులకు గవర్నర్ సూచన
-రోగుల సంరక్షణకు రాష్ట్ర సర్కార్ పెద్దపీట: మంత్రి ఈటల

మాదాపూర్: వైద్యరంగంలో భారత్ పాత్ర చారిత్రాత్మకమని, ఆధునిక వైద్యం, ప్లాస్టిక్ సర్జరీ పితామహుడైన సుశ్రుతుడే అందుకు కారకులని, మన ఆయుర్వేద వైద్యవిధానమే నేటి శస్త్రచికిత్సా పద్ధతులకు పునాది అని రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందర్‌రాజన్ అన్నారు. ఇంటర్నేషనల్ పేషెంట్ సేఫ్టీ కాన్ఫరెన్స్ అండ్ ట్రాన్స్‌ఫార్మింగ్ హెల్త్‌కేర్ విత్ ఐటీ అనే అంశాలపై మాదాపూర్ (హైదరాబాద్)లోని హెచ్‌ఐసీసీలో శనివారం నిర్వహించిన సదస్సుకు గవర్నర్ తమిళిసై ముఖ్యఅతిథిగా విచ్చేశారు. రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్, అపోలో హాస్పిటల్స్ చైర్మన్ డాక్టర్ ప్రతాప్ సీ రెడ్డితో కలిసి సదస్సును ప్రారంభించిన అనంతరం గవర్నర్ మాట్లాడుతూ.. రోగుల సంరక్షణ కోసం ప్రత్యేక సదస్సును ఏర్పాటుచేయడం హర్షణీయమన్నారు. దవాఖానలకు రోగులు ప్రత్యేక అతిథులని, వారికి ప్రేమతో వైద్యసేవలందించాలని సూచించారు. మంత్రి ఈటల మాట్లాడుతూ.. రోగుల సంరక్షణకు రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేస్తున్నదని, నిరుపేదలకు కార్పొరేట్ దవాఖానల్లో ఖరీదైన వైద్యాన్ని అందిస్తున్న ఘనత తెలంగాణ ప్రభుత్వానిదేనని తెలిపారు.

వర్సిటీలపై 24న గవర్నర్ సమీక్ష

రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాలపై గవర్నర్ తమిళిసై సౌందర్‌రాజన్ దృష్టి సారించారు. చాన్స్‌లర్ హోదాలో ఆమె ఈ నెల 24న వర్సిటీల ఇంచార్జి వీసీలు, రిజిస్ట్రార్లతో సమీక్ష నిర్వహించనున్నారు. వీసీల పదవీకాలం పూర్తయి రెండునెలలు దాటిన నేపథ్యంలో ఆమె ఈ సమీక్ష నిర్వహించనున్నట్టు సమాచారం. ఖాళీల భర్తీ ప్రక్రియ, బయోమెట్రిక్ హాజరు అమలు తదితర అంశాలపై ఈ సమీక్షలో చర్చించే అవకాశం ఉన్నట్టు తెలుస్తున్నది.

216
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles