ఏడు జిల్లాల్లో భారీ వర్షం

Mon,October 21, 2019 03:21 AM

-మరో నాలుగు జిల్లాల్లో ఓ మోస్తరు
-పొంగిపొర్లుతున్న వాగులు, వంకలు
-పొంగిపొర్లుతున్న వాగులు, వంకలు అత్యధికంగా భూపాలపల్లి జిల్లా గణపురంలో 11.2 సెం.మీ. వర్షపాతం
-రాష్ట్రవ్యాప్తంగా మరో రెండ్రోజులు.. గ్రేటర్ హైదరాబాద్‌లో వచ్చే ఐదురోజులు వర్షసూచన

నమస్తేతెలంగాణ నెట్‌వర్క్: ఉపరితల ఆవర్తన ద్రోణుల ప్రభావంతో రాష్ట్రంలో వర్షాలు కురుస్తున్నాయి. ఆదివారం ములుగు, జయశంకర్ భూపాలపల్లి, భద్రాద్రి కొత్తగూడెం, కరీంనగర్, రాజన్న సిరిసిల్ల, పెద్దపల్లి జిల్లాలతోపాటు గ్రేటర్ హైదరాబాద్‌లో భారీ వర్షం కురువగా ఖమ్మం, మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్, సూర్యాపేట జిల్లాల్లో ఓ మోస్తరు వాన పడిం ది. ములుగు జిల్లా మేడారంలో వరద నీటిలో నుంచి వెళ్తుండగా విద్యుదాఘాతానికి రైతు మృతిచెందాడు. అత్యధికంగా జయశంకర్ భూపాలపల్లి జిల్లా గణపురం మండలంలో 11.2 సెం.మీ. వర్షపాతం నమోదైంది.

జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో భారీగా..

జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో శనివారం రాత్రి నుంచి ఆదివారం తెల్లవారుజాము వర కు వర్షం కురిసింది. గణపురం మండలంలో మోరంచవాగు పొంగిపొర్లుతున్నది. మహాముత్తారం మండలంలో దౌతుపల్లి వాగు బ్రిడ్జిపై నుంచి నీరు పొంగుతుండడంతో రాకపోకలు నిలిచిపోయాయి. ఓపెన్‌కాస్టు సెక్టార్- 2లో బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది.

rain2

ములుగులో కుండపోత..

ములుగు జిల్లాలో కురిసిన కుండపోత వర్షం తో వాగులు పొంగిపొర్లాయి. తాడ్వాయి మండలం మేడారంలో వరద నీటిలో విద్యుత్ తీగ పడటంతో విద్యుదాఘాతానికిగురై రైతు కడారి లక్ష్మీనారాయణ మృతిచెందాడు. గో విందరావుపేట మండలం లక్నవరం సరస్సు మళ్లీ అలుగుపోసింది. ఏటూరునాగారం మండలంలో 9.7 సెం.మీ., వెంకటాపురం (నూగూరు)లో 9.4 సెం.మీ., మంగపేటలో 8.6 సెం.మీ., గోవిందరావుపేటలో 8.6 సెం.మీ. వర్షపాతం నమోదైంది. వరంగల్ రూరల్ జిల్లా ఖానాపురం మండలంలోని పాకాల సరస్సు మత్తడిపోస్తున్నది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఆదివారం ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసింది. కరీంనగర్ జిల్లాలో కురుస్తున్న వర్షాలకు సైదాపూర్, శంకరపట్నం, హుజూరాబాద్, జమ్మికుంట మండలాల పరిధిలోని వాగులు పొంగుతున్నాయి. పెద్దపల్లి జిల్లా కాల్వశ్రీరాంపూర్, ఓదెల, ధర్మారం మండలాల్లోని దాదాపు 500 ఎకరాల్లో పంటలకు నష్టం వాటిల్లింది. రాజన్న సిరిసిల్ల జిల్లాకేంద్రంతోపాటు వేములవాడ, వీర్నపల్లి, ఇల్లంతకుంట, గంభీరావుపేటలో అరగంటపాటు ఓ మోస్తరు వర్షం పడింది. ఖమ్మం నగరంలో ఓ మోస్తరు వర్షం కురిసింది. సూర్యాపేట జిల్లా కోదాడలో 2.5 సెం.మీ, చిలుకూరు 1.5 సెం.మీ. వర్షపాతం నమోదైంది. మహబూబ్‌నగర్ జిల్లాలోని పలుచోట్ల, నాగర్‌కర్నూల్ జిల్లా బిజినేపల్లి మండలంలో ఓ మోస్తరు వర్షం కురిసింది.

గ్రేటర్ హైదరాబాద్‌లో భారీగా..

ఉపరితల ఆవర్తన ద్రోణుల ప్రభావంతో గత రెం డు రోజులుగా గ్రేటర్ హైదరాబాద్‌లో వర్షాలు కురుస్తున్నాయి. ఆదివారం ఉదయం నుంచి గ్రేటర్‌వ్యాప్తంగా ఓ మోస్తరు నుంచి భారీ వర్షం కురిసింది. చాంద్రాయణగుట్ట, బండ్లగూడలో 4.2 సెం.మీ., చార్మినార్‌లో 4 సెం.మీ., మలక్‌పేటలో 3.7 సెం.మీ., ఆసిఫ్‌నగర్, మెహిదీపట్నం, షేక్‌పేటలో 3.4 సెం.మీ., శేరిలింగంపల్లి, గచ్చిబౌలి, మాదాపూర్‌లో 3.3 సెం.మీ., రాజేంద్రనగర్‌లో 3.0 సెం.మీ. వర్షపాతం న మోదైనట్టు హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు.

rain3

మరో రెండ్రోజులు రాష్ట్రంలో భారీ వర్షాలు

రాష్ట్రంలో మరో రెండు రోజులు ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశమున్నట్టు వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. తూర్పు మధ్య అరేబియా సముద్రంలో అల్పపీడనం స్థిరంగా కొనసాగుతున్నదని, దీనికి అనుబంధంగా 4, 5 కి.మీ. ఎత్తు వరకు ఉపరితల ఆవర్తనం విస్తరించిందని, తూర్పు మధ్య అరేబియా సము ద్రం నుంచి ఉత్తర కర్ణాటక, తెలంగాణ మీదు గా విదర్భ వరకు ఉపరితల ద్రోణి ఏర్పడినట్టు వారు పేర్కొన్నారు. కోమారిన్ ప్రాంతం నుంచి ఉత్తర కోస్తా ఆంధ్రా వరకు మరో అల్పపీడన ధ్రోణి ఏర్పడింది. ఈ ప్రభావంతో పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నదని వారు తెలిపారు.

వచ్చే ఐదు రోజులు గ్రేటర్ హైదరాబాద్‌లో..

అరేబియా సముద్రం నుంచి కర్ణాటక, తెలంగాణ మీదుగా విదర్భా వరకు, వే ఆఫ్ బెంగాల్ నుంచి ఉత్తర కోస్తాంధ్ర వరకు రెండు వేర్వేరు ఉపరితల ఆవర్తన ద్రోణులు ఏర్పడటంతో వాటి ప్రభావంతో రాగల ఐదు రోజులు గ్రేటర్ హైదరాబాద్ వ్యాప్తంగా ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశమున్నట్టు హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు వెల్లడించారు.

3574
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles