అసెంబ్లీలో నేడు పద్దులపై చర్చ

Mon,September 16, 2019 01:36 AM

హైదరాబాద్, నమస్తే తెలంగాణ: బడ్జెట్ సమావేశాల్లో భాగంగా సోమవారం అసెంబ్లీలో పద్దులపై చర్చ ప్రారంభంకానున్నది. ఉదయం 10 గంటలకు ప్రారంభమయ్యే సభలో తొలుత ప్రశ్నోత్తరాల కార్యక్రమాన్ని, ఆ తర్వా త పద్దులపై చర్చను చేపడుతారు. ప్రశ్నోత్తరాల్లో భాగంగా అంబేద్కర్ ఓవర్సీస్ విద్యానిధి పథకం, ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు సన్నబియ్యంతో మధ్యాహ్న భోజనం, టీహబ్-2 తదితర అంశాలపై సభ్యుల ప్రశ్నలకు ప్రభుత్వం సమాధానం ఇవ్వనున్నది.


కమిటీలకు నేడు నామినేషన్లు
శాసనసభ, శాసనమండలికి సంబంధించిన ఫైనాన్స్ కమిటీలకు సోమవారం నామినేషన్లు స్వీకరించనున్నారు. పబ్లిక్ అకౌంట్స్ కమిటీ, పబ్లిక్ ఎస్టిమేట్స్ కమిటీ, పబ్లిక్ అండర్‌టేకింగ్స్ కమిటీలకు మధ్యాహ్నం 3.30గంటల వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. ఈ కమిటీల్లో అసెంబ్లీ నుంచి తొమ్మిదిమంది, మండలి నుంచి నలుగురు సభ్యులుగా ఉంటారు.

100
Follow us on : Facebook | Twitter
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles