వర్షంతో సీఎం సభ రద్దు

Fri,October 18, 2019 03:08 AM

-హెలికాప్టర్‌కు అనుమతించని ఏవియేషన్ అధికారులు
-భారీగా తరలివచ్చి నిరాశతో వెనుదిరిగిన జనం
-కిక్కిరిసిన హుజూర్‌నగర్ వీధులు

హైదరాబాద్/ సూర్యాపేట ప్రతినిధి/ హుజూర్‌నగర్, నమస్తే తెలంగాణ: ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా గురువారం హుజూర్‌నగర్‌లో నిర్వహించాల్సిన ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు బహిరంగసభ బలమైన ఈదురుగాలు, భారీవర్షం కారణంగా రద్దయింది. మెరుపులతో కూడిన భారీవర్షంతోపాటు పిడుగులు పడే అవకాశం ఉన్నదని ఏవియేషన్ అధికారులు సీఎం హెలికాప్టర్‌కు అనుమతి నిరాకరించడంతో సభ రద్దయినట్టు విద్యుత్‌శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి సభా వేదికపై ప్రకటించారు. పైలట్ల సూచన మేరకు హెలికాప్టర్‌కు అనుమతి రద్దుచేసినట్టు ఏవియేషన్ డైరెక్టర్ భరత్‌రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. సీఎం కేసీఆర్ గురువారం మధ్యాహ్నం 2 గంటలకు హుజూర్‌నగర్ బహిరంగసభకు హాజరుకావాల్సి ఉన్నది. మధ్యాహ్నం వరకు వాతావరణం పొడిగా ఉండటం.. స్వయంగా సీఎం కేసీఆర్ హాజరవుతుండటంతో టీఆర్‌ఎస్ కార్యకర్తలు, అభిమానులు భారీసంఖ్యలో సభా ప్రాంగణానికి చేరుకున్నారు. అయితే, అప్పటివరకు పొడిగా ఉన్న వాతావరణం ఒక్కసారిగా మేఘావృతంగా మారి.. ఈదురుగాలులు, ఉరుములతో భారీవర్షం కురిసింది. హుజూర్‌నగర్ వీధులన్నీ ప్రజలు, వాహనాలతో కిక్కిరిసిపోయాయి.

వర్షంలోనూ సీఎం కోసం ఎదురుచూసిన కార్యకర్తలు: జగదీశ్‌రెడ్డి

TRS-Meeting1
భారీ వర్షంలోనూ కార్యకర్తలు సీఎం కేసీఆర్ రాకకోసం ఎదురుచూశారని విద్యుత్‌శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి తెలిపారు. ప్రచారం శనివారం ముగుస్తుండటంతో అనుసరించాల్సిన వ్యూహాలపై గురువారం హుజూర్‌నగర్‌లోని టీఆర్‌ఎస్ కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. వర్షం కురుస్తున్నా అధినేతను చూడాలనే ఆరాటం ప్రజల్లో కనిపించిందన్నారు. ఎలాంటి ఏర్పాట్లు చేయకున్నా స్వచ్ఛందంగా తరలివచ్చారని, వర్షంతో సభ రద్దు కావడంతో నిరాశ చెందారని చెప్పారు. ఉప ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ను గెలిపించుకోవాలన్న కసి కార్యకర్తల్లో తొణికిసలాడిందని హర్షం వ్యక్తంచేశారు. సభ రద్దయిందని ప్రకటించే వరకూ ఒక్కరూ కూడా కదలకపోవడమే ఇక్కడ గులాబీ విజయానికి సంకేతమన్నారు. సమావేశంలో ఎమ్మెల్యేలు కిశోర్, భూపాల్‌రెడ్డి, భాస్కర్‌రావు, లింగ య్య, ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్, మాజీ ఎమ్మె ల్సీ పూల రవీందర్, టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి శానంపూడి సైదిరెడ్డి పాల్గొన్నారు.
TRS-Meeting0

2434
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles