సాగర్ ఎడమ కాల్వలో చిన్నారి గల్లంతు

Mon,September 16, 2019 01:40 AM

గరిడేపల్లి: సూర్యాపేట జిల్లా గరిడేపల్లి మండలం మర్రికుంట గ్రా మంలో ఆదివారం ప్రమాదవశాత్తు సాగర్ ఎడమ కాల్వలో పడి ఓ చిన్నారి గల్లంతైంది. మర్రికుం టకు చెందిన ధరావత్ వీరయ్య, బుర్రీ దంపతుల కుమార్తె సిరి(9) పొనుగోడులోని ఓ స్కూల్‌లో నా లుగో తరగతి చదువుతున్నది. ఇంటి ముందే సాగర్ ప్రధాన ఎడమ కాల్వ ఉండటంతో సిరి కాళ్లు, చేతులు కడుక్కునేందుకు కాల్వలోకి దిగింది. మెట్లపై కాలు జారడంతో కాల్వలో పడి గల్లంతైందని స్థానికులు తెలిపారు. కండ్ల ముందే బిడ్డ గల్లంతుకావడంతో తల్లిదం డ్రుల రోదనలు మిన్నంటాయి. చిన్నారి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.




551
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles