రాజసం ఉట్టిపడే రాతి నిర్మాణాలు

Mon,July 31, 2017 12:47 PM

Leave the stately stone structures

నల్లగొండ: సూర్యాపేటకు తొమ్మిది కిలోమీటర్ల దూరంలో ఉన్న పిల్లలమర్రిలో కాకతీయుల కాలంలో జీవం పోసుకున్న దేవాలయాలు, శిల్పకళా సంపద.. భారతీయ సంస్కృతి, సాంప్రదాయాలు ఉట్టిపడేలా కళ్లకు కట్టినట్లుగా కనిపిస్తున్నాయి. బౌద్ధ మతానికి సంబంధించిన ప్రతిమలను, జీవిత ఘట్టాలను, జ్ఞానోదయ చిత్రాలతోపాటు శాంతి చిహ్నాలు తదితర సన్నివేశాలు, ఆరామ కుడ్యాలపై ఎంతో అద్భుతంగా చెక్కబడ్డాయి. బౌద్ధ శిల్పకళలో సహజ సుందర దృశ్యాలకు, పశు పక్షాదులకు కూడా స్థానం లభించింది. అయితే మత ప్రచారానికి తోడ్పడే విధంగా అది రూపాంతరం చెందింది. ఉత్తర దక్షిణ శిల్పకళా సంస్కృతుల సమ్మేళనంతో కొత్త తరహా శిల్పకళను ఇక్కడ ప్రవేశపెట్టిన ఘనత కాకతీయులకే దక్కింది.

Leave the stately stone structures

క్రీ.శ.1000 నుంచి 1324 వరకు కాకతీయరాజులు ఆంధ్రదేశాన్ని పరిపాలించారు. ఇదే కాలంలో వారి సామంతులుగా, మాండలికులుగా నల్లగొండను పాలించిన రేచర్ల వంశస్థులు ఈ తరహా శిల్పాలను ఆదరించారు. వీటిలో భాగంగానే పిల్లలమర్రి, పెన్‌పహాడ్ మండలం నాగులపాటి అన్నారం గ్రామాల్లో నిర్మించిన దేవాలయాలు శిల్పుల మేధాశక్తి, కళలకు ప్రతీకలుగా చెప్పవచ్చు. ఒకవైపు కాకతీయ సామ్రాజ్య సంరక్షణకు యుద్ధాలు చేస్తూనే మరోవైపు శిల్పకళను ప్రోత్సహించడం వారి బహుముఖ ప్రజ్ఞాపాటవాలకు నిదర్శనం. ఆనాటి శిలలపై నగ్న దృశ్యాలు, సౌందర్య కుసుమాలు తదితర దర్పణంలాంటి చెక్కడాలు కళ్లను మైమరిపిస్తాయి.

త్రికుటేశ్వరాలయం


Leave the stately stone structures

పిల్లలమర్రి గ్రామం ఉన్న త్రికుటేశ్వరాలయాన్ని కాకతీయుల రాజు అయిన రేచర్ల నామిరెడ్డి క్రీ.శ.1202లో నిర్మించారు. దుందుభి నామ సంవత్సరం చైత్రశుద్ధ ఏకాదశి శనివారం నాడు రాజు తన పేర నామేశ్వరలింగం ప్రతిష్ఠించి పూజాధికారులకు, దూపదీప నైవేద్యాలకు భూదానం ఇచ్చారు. ఈ విషయం వివరిస్తూ అక్కడ శాసనం కూడా రాయించారు. అదే ఆలయంలో మూడు శివాలయాలు ఏర్పాటు చేశారు. నామిరెడ్డి పేరు మీద నామేశ్వరాలయం మొదటిది కాగా, రాజు తన తల్లి పేరు మీద కాచేశ్వర, తండ్రి పేరున కామేశ్వర లింగాలను దేవాలయంలో ప్రతిష్ఠించాడని శాసనంలో ఉంది.

దేవాలయాలతోపాటు పెద్దచెరువు


Leave the stately stone structures

Leave the stately stone structures

పిల్లలమర్రిలో శిల్పకళా సంపద ఉట్టిపడే దేవాలయాలే కాదు.. త్రికుటేశ్వరాలయానికి అతి సమీపంలో పెద్ద చెరువు కూడా ఉంది. మూసీ నదిలో నీళ్లున్నంత కాలం ఆ చెరువులో జలకళ ఉట్టిపడుతుంది.
ఇదిలావుండగా, పిల్లలమర్రి ఆలయాలు పర్యాటకులను ఆకర్శించే రీతిలో ఉన్నప్పటికీ తదనుగునంగా ప్రచారం లేదనే చెప్పవచ్చు. ఎలాంటి సౌకర్యాలు లేకనప్పటికీ ఇక్కడకు వచ్చిన భక్తులు చెరువు వద్దకు వెళ్లి చిన్న బోట్‌లో శికారు చేస్తున్నారు. ప్రభుత్వం స్పందించి గ్రామంలో ఉన్న ఆలయాల పునరుద్ధరణతోపాటు చెరువు పునరుద్ధరణ చేసి బోటింగ్ ఏర్పాటు చేస్తే పర్యాటక కేంద్రంగా మారే అవకాశం ఉంది. అమెరికాలో స్థిరపడిన పిల్లలమర్రి గ్రామానికి చెందిన డాక్టర్ గవ్వ చంద్రారెడ్డి, ఆయన సోదరులు సొంత నిధులతో దేవాలయాలను కొంతమేర అభివృద్ధి చేశారు. జాతీయ రహదారి వద్ద ఆర్చి ఏర్పాటు చేశారు.

800 ఏళ్ల నాటి బావి


Leave the stately stone structures

ఎరుకేశ్వరాలయ ఆవరణలో 800 సంవత్సరాల క్రితం బేతిరెడ్డి భార్య ఎరుకసాని తాగునీటి కోసం తవ్వించిన బావి ఇప్పటికీ ఉంది. ఎంతటి వర్షాభావ పరిస్థితులు నెలకొని కరువు వచ్చినా ఆ బావిలో నీరు ఇంకిపోలేదని గ్రామస్తులు చెబుతున్నారు.

త్రికుటాలయంలో ఆసక్తికరమైన నంది


Leave the stately stone structures

త్రికుటేశ్వరాలయంలో శివలింగాలను కాపాడేందుకు రేచర్ల నామిరెడ్డి నంది విగ్రహాన్ని చేశారు. ఆ నంది మూడు శివలింగాలను కాపాడుతున్నట్లు అనిపిస్తుంది. మూడింటిలో ఏ శివలింగం ముందు నిలబడి చూసినా నంది దాని వైపే చూస్తునట్లుగా కనిపిస్తుంది. అక్కడకు వచ్చే భక్తులు మూడు లింగాలను దర్శించుకొని వెళ్తుంటారు.

14196

More News

Featured Articles

Health Articles