వహ్వా.. వాణి!


Sun,October 6, 2019 03:06 AM

Vaani-Kapoor
‘వార్‌' మొదలైంది.. హృతిక్‌.. టైగర్‌ ష్రాఫ్‌ మధ్యలో.. అందంగా విరిసిన పువ్వే.. వాణి కపూర్‌.. ట్రైలర్‌ చూసినప్పుడే ఆమె అందాలు అందర్నీ పిచ్చెక్కించాయి.. సినిమా చూశాక అందరి మతులూ పోయాయి.. కానీ, ఈ అమ్మడు ఎప్పుడో తెలుగు తెరకు పరిచయమైంది.. నానితో ‘ఆహా.. కళ్యాణం’లో ఆడిపాడింది.. ‘వార్‌'తో మళ్లీ ప్రపంచం అంతా మాట్లాడుకుంటున్నారు.. మరి మనం ఈ అమ్మడి గురించి తెలుసుకోకపోతే ఎలా? అందుకే వాణీ కపూర్‌ గురించి కొన్ని సంగతులు.....

- సౌమ్య నాగపురి

రణ్‌బీర్‌ కపూర్‌, సంజయ్‌దత్‌ నటిస్తున్న షంషేరా సినిమాలోనూ వాణి మెరువనుంది. అయితే సంజయ్‌దత్‌ గురించి.. ‘అతను ఒక చిన్న పిల్లాడిలా ప్రవర్తిస్తాడు. చాలా స్వీట్‌ పర్సన్‌' అని సోషల్‌ మీడియాలో కితాబు ఇచ్చింది. ఈ కామెంట్‌ నెట్టింట వైరల్‌ అయింది.

ఢిల్లీలోనే ఈ అమ్మడు పుట్టి పెరిగింది. తండ్రి ఫర్నీచర్‌ బిజినెస్‌ చేస్తాడు. తల్లి టీచర్‌గా కొన్ని సంవత్సరాలు పని చేసింది. ఆ తర్వాత మార్కెటింగ్‌ ఎగ్జిక్యూటివ్‌గా మారి బిజినెస్‌ చూసుకుంటున్నది.

వాణి స్కూల్లో ఎవరినీ ప్రేమించొద్దని అనుకుందట. దీనికి కారణం.. ఒకసారి స్కూల్‌ వదిలి వెళ్లిపోతే ఒకరికొకరు గుర్తుండరు. ప్రేమ, పెండ్లి అంటే అది తనకు చాలా గౌరవం. కాకపోతే బ్రాడ్లీ కూపర్‌ని తను ఆ సమయంలో బాగా ఆరాధించిందట.

త్రిబువన్‌దాస్‌ భీమ్‌జీ జవేరీ జువెలర్స్‌, అర్బన్‌ చిక్‌ లుక్‌, క్యాడ్‌బెరీ డైరీ మిల్క్‌ సిల్క్‌ యాడ్స్‌లో ఈ అమ్మడు కనిపించింది.

ఐటీసీ హోటల్‌.. జైపూర్‌లోని ఒబెరాయ్‌ హోటల్స్‌, రిసార్ట్స్‌లో వాణీ కపూర్‌ ఇంటర్న్‌షిప్‌ చేసింది.

యాడ్స్‌ చేస్తున్నప్పుడు యష్‌రాజ్‌ ఫిల్మ్స్‌ వాళ్లు.. మూడు సినిమాలకు సంతకం చేసింది.

వాణి తండ్రి ఒక ఎన్జీవో నడిపేవాడు. దాంట్లో జంతువుల సంరక్షణ చేసేవారు. అందుకే వాళ్ల ఫామ్‌హౌస్‌.. చిన్నపాటి జూని తలపించేదంటున్నది వాణి. చిన్నప్పటి నుంచి జంతువుల మధ్య పెరిగింది. అందుకే జంతువుల మీద మక్కువ ఎక్కువ అంటున్నది.

రణ్‌వీర్‌తో చేసిన బేఫికర్‌ సినిమా చేసింది. ఇందులో ఆమె ఇచ్చిన 23 ఫ్రెంచ్‌ కిస్‌లతో టాక్‌ ఆఫ్‌ ద ఇండస్ట్రీగా మారింది.

వాణికి బయట పబ్‌, డిస్కోలకి వెళ్లడం కంటే.. ఇంట్లోకి అందరినీ పిలిచి పార్టీ ఇవ్వడం ఇష్టమంటున్నది.

మోడలింగ్‌లోకి అడుగుపెట్టకముందు ఆమె బరువు 75 కిలోలట. కానీ, మోడలింగ్‌కి వచ్చాక.. ఆమె బరువు తగ్గి సరైన ఆకృతిలోకి వచ్చానంటున్నది.

మొదటి సినిమా ‘శుద్ధ్‌ దేశీ రొమాన్స్‌' కి గాను దాదాపు ఏడు అవార్డులకు వాణి నామినేట్‌ అయింది. అందులో ఐదు గెలుచుకున్నది.

సోనీ టీవీలో.. అనురాగ్‌ కశ్యప్‌ దర్శకత్వం వహించిన స్పెషల్‌ 10 సిరీస్‌ రాజుబెన్‌ అనే సీరియల్‌లో వాణి మొదట కనిపించింది.

635
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles