నెట్టిల్లు


Sun,September 8, 2019 01:06 AM

పని చేయడం వేరు. నచ్చిన పని చేయడం వేరు. ఇట్లా సినిమా రంగంపై ఆసక్తి ఉన్న చాలా మంది ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటారు. కొందరు యువకులు షార్ట్‌ ఫిల్మ్స్‌ ద్వారా తమ ప్రతిభను నిరూపించుకుంటున్నారు. ఇలాంటి వాటిని ప్రోత్సహించడానికే ఈ సమీక్షలు. ఇటీవల యూట్యూబ్‌లో వచ్చిన షార్ట్‌ ఫిల్మ్స్‌ రివ్యూలను ఇక్కడ ఇస్తున్నాం. చూడండి.

కృష్ణగాడి ప్రేమ కథ


దర్శకత్వం: వెంకట్‌ నివాస్‌ నందన్‌
నటీనటులు : సతీశ్‌, మాధురి
క్రిష్ణ, అంజు చిన్ననాటి స్నేహితులు. అంజు ఆమె బాబాయ్‌ వాళ్ల ఇంట్లో పెరుగుతుంది. చిన్నప్పుడే బాబాయ్‌కు ఉద్యోగ బదిలీ కావడంతో స్నేహితులిద్దరూ దూరమవుతారు. స్నేహానికి జ్ఞాపకంగా అంజూకు క్రిష్ణ ఓ బహుమతి ఇస్తాడు. సీన్‌ కట్‌ చేస్తే ఇద్దరికీ కాలేజీ ఈడొస్తుంది. ఫలానా కాలేజీలో అంజూ చేరుతుందని తెలుసుకున్న క్రిష్ణ తన కోసం అదే కాలేజీల జాయిన్‌ అవుతాడు. చిన్నప్పటి స్నేహం గురించి చెప్పకుండా పరిచయం చేసుకొని ప్రేమను వ్యక్తం చేస్తాడు. ఇలా ఇద్దరూ ప్రేమించుకుంటారు. మరో సీన్‌లో క్రిష్ణ వాళ్ల ఫ్రెండ్‌ ఒకతను మరో అమ్మాయిని ప్రేమించి, ఇంటి నుంచి బయటకు తీసుకొస్తాడు. ఇది వివాదాస్పదం అవుతుంది. ఇందులో క్రిష్ణ వారికి సాయం చేస్తాడు. ఆ ప్రేమ జంటను ఒకటి చేస్తాడు. కానీ క్రిష్ణ చిన్నప్పుడు అంజూకి ఇచ్చిన బహుమతిని ఈ అమ్మాయి దగ్గర చూసి అర్థం చేసుకుంటాడు అసలైన అంజూ ఈమెనే అని. ప్రేమించిన అమ్మాయిన దూరం చేసుకోకుండా, చిన్న నాటి స్నేహాన్ని ప్రేమ అని అనుకోకుండా ముందుకు వెళ్తాడు క్రిష్ణ. ఫైటింగ్‌ సీన్లు, పాత్రలు, బ్యాక్‌గ్రౌండ్‌ మ్యూజిక్‌ బాగున్నాయి.

Total views
24,354+
(ఆగస్టు 31 నాటికి)
Published on
Aug 22, 2019


రాజారాణి


దర్శకత్వం: లక్ష్మివినాయక్‌
నటీనటులు : వివన్‌ అక్షయ్‌, పల్లవి
చిన్నప్పుడు కలహాలతో దూరమైన మామయ్య కుంటుంబాన్ని, ఆమె కుటుంబాన్ని కలపాలనుకుంటుంది అక్షర. ఓ రోజు ఇంట్లో చెప్పకుండా మామయ్య వాళ్ల ఇంటికి వెళ్తుంది. వాళ్లు బాగానే రిసీవ్‌ చేసుకుంటారు. అక్షర బావ పేరు హరి. అతనంటే ఆమెకు ఇష్టం. మరోవైపు హరి కూడా చిన్నప్పటి నుంచి ఆమె కోసమే ఎదిరి చూస్తూ ఉంటాడు. మొత్తనికైతే ఇప్పుడు వచ్చిందని సంతోషిస్తాడు. ఇలా కొన్ని రోజులు హరి వాళ్ల ఇంట్లోనే ఉంటుంది అక్షర. ఓ రోజు తన ప్రేమ సంగతి అక్షరకు చెప్తాడు. ఉన్నట్టుంది అది ఇంట్లో వాళ్లకు తెలుస్తుంది. అక్షర వాళ్ల నాన్న కూడా సీరియస్‌ అవుతాడు. ఆ ఇంటికి ఎందుకు వెళ్లావు అని చివాట్లు పెడతాడు. పెద్దల కలహాల మధ్య వీరి ప్రేమ ఓడిపోతుందనుకుంటారు ఇద్దరు. కానీ హరి పెద్ద వాళ్లను ఒప్పిస్తాడు. దీంతో లైన్‌ క్లియర్‌ అవుతుంది. విషయం అక్షరకు చెప్తాడు.సంతోష పడుతుంది. పెద్ద వాళ్ల మధ్య ఉన్న గొడవల కారణంగా ప్రేమ విఫలమవ్వాల, పెద్దలు ఆలోచించాలనే సందేశంతో లఘు చిత్రం ముగుస్తుంది.
Total views
7,971+
(ఆగస్టు 31 నాటికి)
Published on Aug 21, 2019


జగదేక వీరుని కథ


దర్శకత్వం: వెంకట్‌
నటీనటులు : రాజశేఖర్‌, వెంకట్‌, శృతి
తండ్రి ఒత్తిడితో ఇంజినీరింగ్‌ చేస్తాడు ఈ లఘుచిత్రంలో హీరో. కానీ అతనికి డైరెక్షన్‌ అంటే చాలా ఇష్టం. ఇప్పటికైన సినిమా తీయ్యాలనుకుంటాడు. కానీ తండ్రి మాత్రం సినిమాలు అవ్వేమీ కుదరదు ఉద్యోగం చేసుకో అని తిడతాడు. కానీ అతను మాత్రం డైరెక్షన్‌ అంటేనే ఇష్టం, ఏడాది టైం ఇవ్వండి నిరూపించుకుంటా అంటాడు. దానికి ఒప్పుకుంటాడు తండ్రి. అతను ఇంక ప్రయత్నాలు మొదలు పెడతాడు. కానీ ఎక్కడా అవకాశం రాదు. చివరికి ఓ ప్రొడ్యూసర్‌ను కలిసి లఘు చిత్రం తీసి ప్రతిభను నిరూపించుకుంటాడు. తండ్రి నుంచి కూడా ప్రశంసలు అందుకుంటాడు. కథ మధ్యలో కన్నడా అమ్మాయితో ప్రేమయాణం సాగుతుంది. ఇటు డైరెక్షన్‌, అటు ప్రేమ రెండూ ఒకే టైంలో సాధిస్తాడు.స్క్రీన్‌ప్లే, బ్యాగ్రౌండ్‌ మ్యూజిక్‌ బాగున్నాయి. మంచి ఎగ్జిగ్యూషన్‌, దర్శకుని ప్రతిభ కనిపించేలా ఉంది.
Total views
7,166+
(ఆగస్టు 31 నాటికి)
Published on Aug 21, 2019


షేడ్స్‌ ఆఫ్‌ లవ్‌ - క్యాస్ట్‌


-దర్శకత్వం: సతీశ్‌
-నటీనటులు : జ్యోతి, మధు, నవీన్‌
ప్రేమకు కొన్నిసార్లు ‘కులం’ అడ్డు వస్తుంది. ప్రేమికులకు అది పట్టింపులేకపోయినా పెద్దలకు మాత్రం అదే పెద్ద సమస్య. ఇలాంటి స్టోరీలైన్‌తోనే ఉన్న లఘు చిత్రం ఇది. రొటీన్‌ కాన్సెప్ట్‌ అయినా ప్రత్యేక వాతావరణంలో తీశారు. అచ్చమైన ప్రకృతిలో, ఇద్దరి గ్రామీణ ప్రేమ కథను చూపించారు. కథలోకి వస్తే.. రాధ ఓ గొర్లకాపరి. కృష్ణ అనే యువకుడు ఓ ఊరి పెద్దాయన దగ్గర జీతగాడు. కృష్ణ రోజూ ఆ పెద్దాయన తోటలో పని చేస్తూ ఉంటాడు. అటువైపే గొర్లను తీసుకొని వస్తుంది రాధ. ఓ రోజు ఇద్దరూ మాట్లాడుకుంటారు. ఈ క్రమంలో కృష్ణ జీతగాడనీ, కిందిస్థాయి కులం అని తెలుసుకొని ఇబ్బందిగా భావిస్తుంది. దీనికి కృష్ణ బాధపడతాడు. దీన్ని అర్థం చేసుకున్న రాధ మళ్లీ కృష్ణతో మాట్లాడానికి ప్రయత్నిస్తుంది. ఈ క్రమంలో రాధ వాళ్ల అన్న చూసి ఈ కులంవాడితో ఏంటి మాటలు అని కృష్ణను కొడతాడు. తీవ్ర మనస్థాపానికి గురైన కృష్ణ బాధపడుతూ వారి ఊరికి వెళ్లడానికి బయల్దేరతాడు. విషయం తెలుసుకున్న రాధ కృష్ణను ఆపడానికి వస్తుంది. కులాలు ఏవైనా నాకు ఇష్టమే అన్న సంకేతంగా ఆలింగనం చేసుకుంటుంది. ఇదీ కథ. బాగుంది. చూడండి.
Total views
698+
(ఆగస్టు 31 నాటికి)
Published on Aug 30, 2019
-వినోద్‌ మామిడాల, సెల్‌: 7660066469

137
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles