రాశి ఫలాలు


Sun,September 8, 2019 12:59 AM

మేషం

గ్రహస్థితి ప్రతికూలంగా ఉంది. అయినా ప్రయాణాలు అనుకూలిస్తాయి. మనఃశ్శాంతి లభిస్తుంది. శ్రద్ధతో పనులు చేస్తారు. ఉద్యోగస్తులకు తోటి వారితో ఇబ్బందులుంటాయి. అనుభవజ్ఞులు, ఆఫీసర్‌లతో సంప్రదింపుల వల్ల కొన్ని పనులు అనుకూలిస్తాయి. రోజువారీ వ్యాపారంలో పని ఒత్తిడి ఉంటుంది. రావాల్సిన డబ్బు అందక పోవచ్చు. పెట్టుబడులకు దూరంగా ఉండడం మంచిది. బంధువులు, మిత్రులతో కొన్ని ఇబ్బందులు ఉంటాయి. రియల్‌ ఎస్టేట్‌, నిర్మాణరంగంలో ఉన్నవారు న్యాయ, ఆర్థికపరమైన సమస్యలను ఎదుర్కొంటారు. కొత్త ప్రాజెక్టులు ప్రారంభించకపోవడం మంచిది.

వృషభం

నలుగురిలో మంచిపేరు పొందుతారు. పనులు అనుకూలిస్తాయి. పిల్లల చదువు, శుభకార్య ప్రయత్నాలు ఫలిస్తాయి. దేవతా, గురుభక్తి పెరుగుతుంది. సంగీత, సాహిత్య, సినిమా రంగాలలో ఉన్న వారికి అవకాశాలు కలిసొస్తాయి. భార్యాపిల్లలతో హాయిగా గడుపుతారు. వృత్తి, వ్యాపారాలు అనుకూలిస్తాయి. ధనలాభం ఉంటుంది. న్యాయవాద, వైద్య, ఉపాధ్యాయ వృత్తిలో ఉన్నవారికి బాగా కలిసొస్తుంది. ఉద్యోగులకు పైఅధికారులతో మనస్పర్థలు ఏర్పడతాయి. రాజకీయంలో ఉన్నవారికి మంచి అవకాశాలు వస్తాయి. ఖర్చులు అధికం అవుతాయి. నియంత్రణ అవసరం.

మిథునం

ప్రధాన గ్రహాలు ప్రతికూలంగా ఉన్నా యి. అయినా ఉద్యోగంలో సంతృప్తి ఉంటుంది. తోటి ఉద్యోగులతో పనులు నెరవేరుతాయి. అధికారుల అండదండలు ఉంటాయి. రాజకీయాలు అనుకూలంగా ఉంటాయి. భూ తగాదాలు ఓ కొలిక్కి వస్తాయి. వాహనాల వల్ల పనులు నెరవేరుతాయి. అన్నదమ్ములు, బంధువులతో స్నేహ పూర్వకంగా ఉంటారు. వ్యవసాయదారులకు అనుకూలంగా ఉంటుంది. భార్యా పిల్లలతో సంతృప్తిగా గడుపుతారు. విందులు, వినోదాలలో పాల్గొంటారు.

కర్కాటకం

వృత్తి, వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. శుభకార్య ప్రయత్నాలు ఫలిస్తాయి. నలుగురిలో మంచి పేరు సంపాదిస్తారు. సంఘంలో మంచి వారితో పరిచయాలు ఏర్పడతాయి. రావాల్సిన డబ్బు అందుతుంది. అనారోగ్యం నయమవుతుంది. పెద్దల సహాయ సహకారాలు అందుతాయి. అనుభవజ్ఞుల సంప్రదింపులతో చాలా పనులు నెరవేరుతాయి. భార్యాపిల్లలతో సంతృప్తిగా ఉంటారు. కొత్త వస్త్ర, వస్తువులు, ఆభరణాలు కొంటారు. సభలు, సమావేశాలలో పాల్గొంటారు. ఉద్యోగంలో తోటి వారితో మనస్పర్థలు ఉంటాయి. వ్యవసాయదారులకు అనుకూలంగా ఉంటుంది. మంచి దిగుబడిని పొందుతారు.

సింహం

ఉద్యోగులు సంతృప్తిగా ఉంటారు. రాజకీయ, కోర్టు వ్యవహారాలలో అనుకూల ఫలితాలుంటాయి. వృత్తి, వ్యా పారాలు అనుకూలిస్తాయి. ప్రయాణాలు కలిసొస్తాయి. సమయానికి నిర్ణయాలు తీసుకోకపోవడంతో ఇబ్బందులకు గురవుతారు. సంగీత, సినిమా రంగాలలో ఉన్న వారికి రావాల్సిన డబ్బు రాకపోవడంతో పనులు వాయిదా వేసుకుంటారు. శుభకార్యాల విషయాలలో ఆటంకాలు ఉంటాయి. అనవసర ఖర్చులు, పనివారితో మనస్పర్థలు ఉంటాయి. వాహనాల వల్ల ఊహించని ఖర్చులుంటాయి. బంధువులు, అన్నదమ్ములతో మనస్పర్థలు ఏర్పడతాయి.

కన్య

గ్రహస్థితులు ప్రతికూలంగా ఉన్నాయి. అయినా నిరుత్సాహపడకుండా పనులు కొనసాగించాలి. భార్యాపిల్లలతో సంతృ ప్తిగా ఉంటారు. ప్రారంభించిన పనుల్లో ఆటంకాలు ఉంటాయి. పిల్లల శుభకార్యాలు, ఉద్యోగ ప్రయత్నాలు ముందుకు సాగకపోవచ్చు. రావాల్సిన డబ్బు చేతికి అందకపో వచ్చు. పనివారితో మనస్పర్థలు ఏర్పడొచ్చు. ఊహించని ఖర్చులుంటాయి. తల్లిదండ్రులు, ఆత్మీయులతో వైషమ్యాలు ఏర్పడతాయి. వాహనాల వల్ల ఖర్చులు ఉంటాయి. వృత్తి, వ్యాపారాలలో పనివారితో ఇబ్బందులుంటాయి.ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి.

తుల

ఈ వారం అనుకూలంగా ఉంటుంది. భార్యాపిల్లలతో సౌఖ్యంగా ఉంటారు. సంగీత, సాహిత్య, సినిమా రంగాలలో ఉన్న వారికి కొత్త అవకాశాలు వస్తాయి. ఆదాయం పెరుగుతుంది. కొత్త వస్త్ర, వస్తువులు, నగలు కొంటారు. వృత్తి, వ్యాపారాలు అనుకూలిస్తాయి. రాజకీయ, కోర్టు వ్యవహారాల్లో సత్ఫలితాలు ఉంటాయి. పెట్టుబడుల వల్ల లాభాన్ని పొందుతారు. శుభకార్య ప్రయత్నాలు ఫలిస్తాయి. ప్రారంభించిన పనులు సకాలంలో పూర్తవుతాయి. సమాజంలో మంచివారితో స్నేహం పెంపొందుతుంది.

వృశ్చికం

ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఉద్యోగులు సంతృప్తిగా ఉంటారు. అనుకున్న పనులు నెరవేరుతాయి. రాజకీయ, కోర్టు వ్యవహారాల్లో సత్ఫలితాలు ఉంటాయి. న్యాయవాద, వైద్య వృత్తులలో ఉన్నవారికి అనుకూలంగా ఉంటుంది. సాహిత్య, సినిమా, పత్రికా రంగాలలో ఉన్న వారికి కొత్త అవకాశాలు వస్తాయి. భార్యాపిల్లలతో సంతృప్తిగా ఉంటారు. కొత్త వస్తువులను కొనడానికి ప్రయత్నిస్తారు. విందులు, వినోదాలలో పాల్గొంటారు. ప్రారంభించిన పనులు కొంత ఆలస్యంగా ముందుకు సాగుతాయి. రావాల్సిన డబ్బు సకాలంలో అందక పోవచ్చు.

ధనుస్సు

గ్రహాలు ప్రతికూలంగా సంచరిస్తున్నాయి. అందుకే ప్రతి విషయంలోనూ జాగ్రత్తగా ఉండాలి. ఉద్యోగస్తులకు తోటివారితో మనస్పర్థలు ఏర్పడొచ్చు. ప్రారంభించిన పనులు సకాలంలో పూర్తికాకపోవచ్చు. ఉద్యోగ ప్రయత్నాలు ఫలించవు. వృథా ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. పనివారితో మనస్పర్థలు ఏర్పడతాయి. వృథా ఖర్చులుంటాయి. పెద్ద వారితో అనవసరమైన గొడవలు జరుగుతాయి. రియల్‌ ఎస్టేట్‌, నిర్మాణరంగం, భూముల వ్యవహారంలో ఇబ్బందులు ఉంటాయి. వాహనాల వల్ల వృథా ఖర్చులుంటాయి. వృత్తి, వ్యాపారాలలోనూ ఇబ్బందులుంటాయి.

మకరం

ప్రారంభించిన పనులు సకాలంలో పూర్తవుతాయి. దేవతా, గురుభక్తి పెరుగుతుం ది. సమాజంలో మంచి పేరు సంపాదిస్తారు. ప్రయాణాలు కలిసొస్తాయి. అనారోగ్య సమస్యలు దూరమవుతాయి. శుభకార్యాలు చేస్తారు. భార్యాపిల్లలతో సంతృప్తిగా ఉంటారు. కొత్త వస్త్ర, వస్తువులను కొంటారు. సంగీత, సాహిత్య రంగాలలో ఉన్న వారికి అవకాశాలు వస్తాయి. ఉపాధ్యాయ, వైద్య వృత్తులలో ఉన్నవారు సంతృప్తిగా గడుపుతారు. రాజకీయంగా ఇబ్బందులు ఉంటాయి. కార్యకర్తలతో, పైవారితో మనస్పర్థలు ఏర్పడతాయి. పనివారితో సమస్యలు తలెత్తుతాయి.

కుంభం

పెద్దల సహాయ సహకారాలు అందుతాయి. తీర్థయాత్రలు చేస్తారు. నదీస్నానాలు ఆచరిస్తారు. రావాల్సిన డబ్బు చేతికి అందుతుంది. కొత్త పనులు చేయాలనే తలంపు పెరుగుతుంది. పనివారితో సమస్యలు తీరుతాయి. భార్యాపిల్లలతో హాయిగా ఉంటారు. కొత్త వస్తువులు కొంటారు. సంగీత, సాహిత్య ప్రియులకు అనుకూలంగా ఉంటుంది. పత్రికా, కళా రంగాలలో ఉన్న వారికి ఆదాయం పెరుగుతుంది. విందులు, వినోదాలలో పాల్గొంటారు. రాజకీయ, కోర్టు వ్యవహారాల్లో ప్రతికూల ఫలితాలు ఎదురవుతాయి.

మీనం

ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. విద్యార్థులు మంచి మార్కులతో పాసవుతారు. పోటీ పరీక్షలలో సత్ఫలితాలను పొందుతారు. ఆరోగ్యం బాగుంటుంది. ఉత్సాహంతో పనులు చేస్తారు. ఉద్యోగంలో, ఆఫీసులో అందరితోనూ సమన్వయంతో ఉంటారు. పై అధికారుల మన్ననలను పొందుతారు. శుభకార్య ప్రయత్నాలు ఫలిస్తాయి. సమాజంలో మంచి పేరు సంపాదిస్తారు. నలుగురికి ఉపయోగపడే పనులు చేస్తారు. అన్నదమ్ములు, బంధువుల సహాయ సహకారాలు ఉంటాయి. వాహనాల వల్ల పనులు నెరవేరుతాయి. వ్యవసాయ దారులు లాభాలను గడిస్తారు. వృత్తి, వ్యాపారాలలో అనుకూలత ఉంటుంది.
Uma-Maheshwara-Sharma-Gudi
గుడి ఉమా మహేశ్వరశర్మ సిద్ధాంతి
ఎం.ఎస్సీ., నిర్మల పంచాంగకర్త
నల్లకుంట, హైదరాబాద్‌., ఫోన్‌: 040-27651530
ఈ మెయిల్‌ : [email protected]

3209
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles