వినాయక వ్రతకల్పం


Sun,September 1, 2019 02:05 AM

Vratham

పూజా ద్రవ్యాలు:పసుపు, కుంకుమ, తమలపాకులు, అగరువత్తులు, వక్కలు, కర్పూరం, గంధం, అక్షింతలు, కొబ్బరికాయలు, కలశము.వినాయకుని మట్టిప్రతిమ లేక విగ్రహం.

పంచామృతం - ఆవు పాలు, ఆవు పెరుగు, ఆవు నెయ్యి, తేనె, పంచదార అన్నీ కలిపినది.
దీపములు - తైలం, నెయ్యి.
వస్త్రములు - పత్తితో చేయవచ్చు.
మధుపర్కాలు - పత్తితో చేయవచ్చు.
యజ్ఞోపవీతం - పత్తితో చేయవచ్చు.

పసుపుముద్దతో వినాయకుడిని చేయాలి. ఒక పీటమీద కొద్దిగా బియ్యము పరచి, పూర్ణకుంభం (వెండి లేదా రాగి లేదా యధా శక్తి చెంబు)లో కొత్త బియ్యము వేసి, వినాయకుని విగ్రహం పెట్టి అలంకరించండి. మామిడాకులు, వివిధ రకాల ఆకులు, లేతగడ్డి ఆకులు, వివిధ రకాల పూలు, పళ్ళు, పాలవెల్లి, గొడుగు.
మహా నైవేద్యం - నేతితో చేసిన 12 రకాల వంటకాలు. ఇవి వీలు కాకపోతే వారి వారి శక్తి కొలది రకరకాల పిండివంటలు చేయవచ్చు. తర్వాత మంచినీటితో గ్లాసు, గ్లాసులో పూవు, ఉద్ధరిణ (చెంచా) ఉంచుకోవాలి.

శ్రీగణేశ ప్రార్థన:
శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం
ప్రసన్న వదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోప శాంతయే ॥
ఉ. తొండము నేకదంతము తోరపు బొజ్జయు వామహస్తమున్
మెండుగ మ్రోయుగజ్జెలును మెల్లని చూపులు మందహాసమున్‌॥
కొండొక గుజ్జురూపమున కోరిన విద్యలకెల్ల నొజ్జయై
యుండెడి పార్వతీ తనయ యోయి గణాధిప నీకు మ్రొక్కెదన్
చం. తొలుత నవిఘ్నమస్తనుచు ధూర్జటి నందన నీకు మ్రొక్కెదన్
ఫలితము సేయుమయ్య నిను ప్రార్థన జేసెద నేకదంత నా
వలపటి చేత ఘంటమున వాక్కున నెప్పెడు బామకుండు మీ
తలపున నిన్ను వేడెదను దైవగణాధిప లోకనాయకా
క. తలచితినే గణనాధుని! తలచితినే విఘ్నపతిని దలచిన పనిగా!
దలచితినే హేరంబుని! దలచితి నా విఘ్నములను తొలగించుటకున్‌॥
క. అటుకులు కొబ్బరి పలుకులు! చిటి బెల్లము నానబ్రాలు చెరకురసంబున్
నిటలాక్షు నగ్ర సుతునకు! వటుతరముగ విందు చేసి ప్రార్థింతు మదిన్!

ఆచమనం -

ఓం కేశవాయ స్వాహా, ఓం నారాయణాయ స్వాహా, ఓం మాధవాయ స్వాహా (అని మూడు సార్లు జలం తాగాలి).
ఓం కేశవాయ నమః, ఓం నారాయణాయ నమః, ఓం మాధవాయ నమః, ఓం గోవిందాయ నమః, ఓం విష్టవేనమః, ఓం మధుసూదనాయ నమః, ఓం త్రివిక్రమాయ నమః, ఓం వామనాయ నమః, ఓం శ్రీధరాయ నమః, ఓం హృషీకేశాయ నమః, ఓం పద్మనాభాయ నమః, ఓం దామోదరాయ నమః, ఓం సంకర్షణాయ నమః, ఓం వాసుదేవాయ నమః, ఓం ప్రద్యుమ్నాయ నమః, ఓం అనిరుద్దాయ నమః, ఓం పురుషోత్తమాయ నమః, ఓం అధోక్షజాయ నమః, ఓం నారసింహాయ నమః, ఓం అచ్యుతాయనమః, ఓం జనార్దనాయ నమః, ఓం ఉపేంద్రాయ నమః, ఓం హరయే నమః, ఓం శ్రీకృష్ణాయ నమః, ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః (అనుకుని కాసిన్ని నీళ్ళు తలపై చల్లుకోవాలి)

శ్లో॥ అపవిత్ర పవిత్రోవా సర్వావస్థాంగ తోపివా యస్మరేత్ పుండరీకాక్షం సబాహ్యంభ్యంతర శ్శుచిః
(ఈ మంత్రం చదివిన తరువాత చేతిలో కొన్ని నీళ్ళు తీసుకుని కింది మంత్రాన్ని పఠించాలి)
భూశుద్ధి -
శ్లో॥ ఉతిష్టంతు భూతపిశాచాః యేతే భూమిభారకాః ఏతేషామవిరోధేన బ్రహ్మ కర్మ సమారభే ॥
(తరువాత కొన్ని అక్షింతలు వాసన చూసి వెనుకకు (కుడివైపు) జల్లుకొని ఈ మంత్రం చదువాలి.)
కలశారాధన : నీటితో ఉన్న ఒక చెంబును తీసుకుని దానికి పసుపు రాసి, పసుపు, కుంకుమ బొట్లు పెట్టాలి. తరువాత ఆ పాత్రలో తమలపాకు, అక్షింతలు వేసి ఆ కలశాన్ని కుడిచేతితో మూసి ఉంచి గంగా జలాన్ని ప్రార్థించాలి.

448
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles