క్వార్టర్స్‌లో మంజు రాణి


Tue,October 8, 2019 03:14 AM

MANJU
న్యూఢిల్లీ: ప్రపంచ మహిళల బాక్సింగ్‌ చాంపియన్‌షిప్‌లో భారత బాక్సర్‌ మంజు రాణి (48 కేజీలు) క్వార్టర్‌ ఫైనల్లో అడుగుపెట్టింది. ఆరోసీడ్‌గా బరిలోదిగిన మంజు రాణి ప్రిక్వార్టర్స్‌లో 5-0తో రోజస్‌ టొయనిక్‌ (వెనిజులా)పై గెలిచింది. ఇరువురు బాక్సర్లు రక్షణాత్మక ధోరణిలో తలపడగా.. మంజు రాణి కచ్చితమైన పంచ్‌లతో సత్తాచాటింది. ఈ ఏడాది ఆరంభంలో జరిగిన ప్రతిష్ఠాత్మక స్ట్రాంజా మెమోరియల్‌ బాక్సింగ్‌ టోర్నీలో రజతం నెగ్గిన మంజు.. ఈ మెగాటోర్నీలో మరో విజయం సాధిస్తే అరంగేట్రంలోనే పతకం ఖాయం చేసుకుంటుంది. గురువారం జరిగే క్వార్టర్‌ ఫైనల్లో టాప్‌ సీడ్‌ కిమ్‌ హ్యాంగ్‌ మీ (దక్షిణ కొరియా)తో మంజు తలపడనుంది. మరో బౌట్‌లో భారత బాక్సర్‌ మంజు బంబోరియా (64 కేజీలు) 1-4తో నాలుగో సీడ్‌ అంజెలా కారినీ (ఇటలీ) చేతిలో ఓడింది. స్టార్‌ బాక్సర్‌, ఆరుసార్లు ప్రపంచ చాంపియన్‌ మేరీ కోమ్‌ (51 కేజీలు) మంగళవారం రింగ్‌లో అడుగుపెట్టనుంది. తొలి రౌండ్‌లో బై దక్కడంతో రెండో రౌండ్‌లో మూడో సీడ్‌ మేరీ కోమ్‌.. థాయ్‌లాండ్‌కు చెందిన జుటామస్‌ జిట్‌పాంగ్‌తో తలపడనుంది.

201

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles