ఒలింపిక్స్‌లో కబడ్డీ కోసం కృషి


Tue,October 8, 2019 03:03 AM

RIJIJU
న్యూఢిల్లీ: మట్టి ఆట కబడ్డీని 2024 పారిస్‌ ఒలింపిక్స్‌లో చేర్చే విధంగా కృషిచేస్తామని కేంద్ర క్రీడాశాఖ మంత్రి కిరణ్‌ రిజిజు పేర్కొన్నారు. దేశవాళీ ఆటను విశ్వవేదికపై వెలుగులీనేలా చేయడానికి యత్నిస్తామన్నారు. ‘ఓ స్వదేశీ క్రీడా విజయవంతంగా వృద్ధి చెందిందనడానికి కబడ్డీ చక్కటి ఉదాహరణ. దేశంలో క్రీడాసంస్కృతి పెంపొందుతుంద నడానికి ఇదే నిదర్శనం. తదుపరి ఒలింపిక్స్‌లో కబడ్డీని చేర్చేందుకు మా వంతు కృషిచేస్తాం. ప్రస్తుతం కబడ్డీకి లభిస్తున్న ఆదరణను బట్టి చూస్తే ఇదేమంత కష్టమైన పనికాదనిపిస్తున్నది. దీనికోసం మేం బలంగా ప్రయత్నించాలని నిర్ణయించాం’ అని రిజిజు తెలిపారు. కబడ్డీని ఒలింపిక్స్‌లో చేర్చాలంటే అంతకుముందు అంతర్జాతీయ ఒలింపిక్‌ కమిటీ (ఐఓసీ) గుర్తింపు సాధించాల్సి ఉంటుంది. అనంతరం అది అంతర్జాతీయ సమాఖ్య (ఐఎఫ్‌)గా నమోదై.. ఆనక ఒలింపిక్స్‌ క్రీడల జాబితాలో చోటు కోసం ప్రయత్నించాల్సి ఉంటుంది.

213

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles