ప్రాక్టీస్‌కు కోహ్లీ, రోహిత్ దూరం


Fri,October 18, 2019 03:33 AM

Rohit
రాంచీ: ఫ్రీడమ్ సిరీస్‌లో భాగంగా శనివారం నుంచి ప్రారంభం కానున్న మూడో టెస్టు కోసం చైనామన్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ చెమటోడ్చుతున్నాడు. వైజాగ్, పుణె టెస్టుల్లో చోటు దక్కించుకోలేకపోయిన కుల్దీప్ రాంచీలో బ్యాటింగ్ ప్రాక్టీస్ చేశాడు. గురువారం జరిగిన ఆప్షనల్ ప్రాక్టీస్‌కు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ దూరంగా ఉంటే.. కుల్దీప్, రహానే, పుజార, మయాంక్, ఇషాంత్ నెట్స్‌లో శ్రమించారు. అంతకుముందు భారత చీఫ్ కోచ్ రవిశాస్త్రి, బౌలింగ్ కోచ్ భరత్ అరుణ్ పిచ్‌ను పరిశీలించారు. పొడిగా ఉన్న వికెట్ స్పిన్నర్లకు అనుకూలించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ వికెట్‌పై స్పిన్నర్లు ప్రభావం చూపగలరు. పొడిగా ఉన్న పిచ్ నుంచి రివర్స్ స్వింగ్ లభించొచ్చు. ఈ మ్యాచ్‌లో స్పిన్నర్లు, రివర్స్‌స్వింగ్ కీలక పాత్ర పోషిస్తాయనుకుంటున్నా అని దక్షిణాఫ్రికా కెప్టెన్ డుప్లెసిస్ పేర్కొన్నాడు. కెప్టెన్‌తో పాటు బవుమా, డిబ్రుయన్, డికాక్, ముత్తుస్వామి ప్రాక్టీస్‌లో పాల్గొన్నారు.

736

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles