కోహ్లీ,శాస్త్రికి ఎస్‌సీజీ సభ్యత్వం


Sat,January 12, 2019 02:31 AM

ravi-kohli
భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ, చీఫ్ కోచ్ రవిశాస్త్రికి తగిన గౌరవం దక్కింది. క్రికెట్‌కు చేసిన సేవలకు గుర్తింపుగా కోహ్లీ, శాస్త్రికి సిడ్నీ క్రికెట్ స్టేడియం(ఎస్‌సీజీ) గౌరవ సభ్యత్వం దక్కింది. ఆస్ట్రేలియా గడ్డపై 71 ఏండ్ల సుదీర్ఘ నిరీక్షణకు తెరదించుతూ భారత్ ఈమధ్యే టెస్ట్ సిరీస్‌ను ముద్దాడిన సంగతి తెలిసిందే. ఈ చిరస్మరణీయ విజయంలో కెప్టెన్ కోహ్లీ, కోచ్ శాస్త్రి కీలకంగా వ్యవహరించారు. ఆస్ట్రేలియాలో తొలిసారి టెస్ట్ సిరీస్‌ను దక్కించుకున్న భారత జట్టుకు ఎస్‌సీజీ తరఫున అభినందనలు. టెస్ట్ క్రికెట్‌ను కోహ్లీ, శాస్త్రి మరింత ముందుకు తీసుకెళుతున్నారు. సుదీర్ఘ ఫార్మాట్‌కు అభిమానుల్లో మరింత ఆసక్తి కల్గించేలా పోటీ వాతావరణం నెలకొల్పుతున్నారు. ప్రపంచంలోనే క్రికెట్‌ను అమితంగా అభిమానించే భారత్ లాంటి దేశం టెస్ట్ క్రికెట్‌పై దృష్టిపెట్టడం చాలా బాగుంది అని ఎస్‌సీజీ చైర్మన్ టోనీ షెఫర్డ్ అన్నాడు. ఇంతకుముందు ఎస్‌సీజీ సభ్యత్వం పొందిన క్రికెటర్లలో సచిన్ టెండూల్కర్‌తో పాటు బ్రియాన్ లారా ఉన్నారు.

281

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles