రొనాల్డో ఆసియా రికార్డు ట్రాక్ ఆసియా కప్


Wed,September 11, 2019 03:34 AM

న్యూఢిల్లీ: ట్రాక్ ఆసియా కప్‌లో భారత్ జోరు కొనసాగుతుంది. తొలి రోజు పోటీల్లో 12 స్వర్ణాలు సాధించిన భారత్.. రెండో రోజు మరో నాలుగు పతకాలు ఖాతాలో వేసుకుంది. సోమవారం రెండు స్వర్ణాలు సాధించిన భారత యువ సైక్లిస్ట్ రొనాల్డో లైతొన్జమ్ ఆసియా రికార్డు నమోదు చేశాడు. పురుషుల జూనియర్ 200 మీటర్ల టైమ్ ట్రయల్ ఈవెంట్‌లో రొనాల్డో 10.065 సెకన్లలో లక్ష్యాన్ని చేరి గతంలో లీ ఖై (చైనా, 10.149 సెకన్లు) పేరిట ఉన్న రికార్డును తిరుగరాశాడు. మంగళవారం వెంకప్ప శివ (3:30.106 సెకన్లు) వ్యక్తిగత 3 కిలోమీటర్ల రేస్‌లో స్వర్ణం దక్కించుకోగా.. 4 కిలోమీటర్ల వ్యక్తిగత విభాగంలో పూనమ్ చంద్ రజతం చేజిక్కించుకున్నాడు. 12 దేశాలకు చెందిన సైక్లిస్ట్‌లు పాల్గొంటున్న ఈ పోటీల్లో ప్రస్తుతం 16 పతకాలతో భారత్ పట్టికలో అగ్రస్థానంలో ఉంది.

279

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles