ఫిక్సింగ్ కలకలం..


Tue,September 17, 2019 04:11 AM

న్యూఢిల్లీ/చెన్నై : భారత మహిళా క్రికెట్ జట్టుతో పాటు తమిళనాడు ప్రీమియర్ లీగ్(టీఎన్‌పీఎల్)లో ఫిక్సింగ్ కలకలం రేగింది. ఈ ఏడాది మొదట్లో స్వదేశంలో జరిగిన ఇంగ్లండ్ సిరీస్‌లో ఫిక్సింగ్‌కు పాల్పడాలని కొందరు తనను సంప్రదించారని భారత మహిళా క్రికెటర్ ఒకరు బీసీసీఐ అవినీతి నిరోధక విభాగానికి(ఏసీయూ) ఫిర్యాదు చేయడం సంచనలంగా మారింది. ఐసీసీ ఈ విషయంలో విచారణ చేపట్టి, క్రికెటర్‌ను సంప్రదించిన వారిని హెచ్చరించిందని బీసీసీఐ ఏసీయూ హెడ్ అజిత్ సింగ్ షెకావత్ తెలిపారు. అలాగే తమిళనాడు ప్రీమియర్ లీగ్‌లో మ్యాచ్ ఫిక్సింగ్ జరిగిందనే అనుమానంతో ఇద్దరు కోచ్‌లు సహా కొందరు ఫస్ట్‌క్లాస్ ప్లేయర్లు, లీగ్ అధికారులపై బీసీసీఐ ఏసీయూ నిఘా ఉంచనుంది.

423

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles