టెన్ పిన్ బౌలింగ్‌ను ప్రోత్సహిస్తాం


Thu,July 11, 2019 02:57 AM

-మంత్రి శ్రీనివాస్ గౌడ్
Ten-pin-bowling
హైదరాబాద్, నమస్తే తెలంగాణ: టెన్ పిన్ బౌలింగ్ క్రీడకు ప్రభుత్వం తరఫున అన్ని విధాల ప్రోత్సాహం అందిస్తామని రాష్ట్ర క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ హామీ ఇచ్చారు. సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లి క్రీడకు విశేష ప్రాచుర్యం కల్పించే కార్యక్రమాలు చేపట్టేందుకు కృషి చేస్తామని తెలిపారు. నగరంలోని పార్క్ హయత్ హోటల్‌లో బుధవారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో తెలంగాణ టెన్ పిన్ బౌలింగ్ అసోసియేషన్ లోగోను మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఆవిష్కరించి, మాట్లాడారు. ఈ క్రీడా అసోసియేషన్ ఏర్పాటు హర్షించదగ్గ విషయమని, దీని ద్వారా ఆటను విస్తృతం చేయాలని సూచించారు. టెన్ పిన్ క్రీడాకారులను తయారు చేయడం సహా రాష్ట్రస్థాయి టోర్నీల నిర్వహణకు ప్రతినిధులు కృషి చేయాలన్నారు. ఈ సందర్భంగా తెలంగాణ టెన్ పిన్ బౌలింగ్ అసోసియేషన్ అధ్యక్షుడు రాహుల్ రెడ్డితో పాటు ప్రతినిధులను ఆయన అభినందించారు. క్రీడాకారులకు మెమొంటోలు ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో సాట్స్ ఛైర్మన్ వెంకటేశ్వర్ రెడ్డి, స్మాష్ గ్రూప్ మేనేజింగ్ డైరెక్టర్ వీరేందర్ గౌడ్ పాల్గొన్నారు.

196

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles