తెలుగు టైటాన్స్‌ బోణీ అదరగొట్టిన సిద్ధార్థ్‌, విశాల్‌


Mon,August 12, 2019 02:45 AM

pkl
అహ్మదాబాద్‌: ప్రొ కబడ్డీ లీగ్‌ ఏడో సీజన్‌లో తెలుగు టైటాన్స్‌ ఎట్టకేలకు బోణీ కొట్టింది. ఐదు పరాజయాలు, ఓ టై తర్వాత సమిష్టి కృషితో విజయం రుచిచూసింది. ఆదివారం ఇక్కడ జరిగిన పోరులో టైటాన్స్‌ 30-24తో ఆతిథ్య గుజరాత్‌ ఫార్చూన్‌ జెయింట్స్‌పై గెలుపొందింది. కబడ్డీ ‘బాహుబలి’సిద్ధార్థ్‌ దేశాయ్‌(7 పాయింట్లు) రైడింగ్‌లో చేలరేగితే.. ట్యాక్లింగ్‌లో విశాల్‌ భరద్వాజ్‌(7) అదరగొట్టాడు. తొలిరైడ్‌లోనే సిద్ధార్థ్‌ ఖాతా తెరువగా... అప్పటి నుంచి చివరి దాకా తెలుగు టైటాన్స్‌ ఆధిక్యాన్ని కాపాడుకుంది. మ్యాచ్‌ ఆరో నిమిషంలోనే విశాల్‌ అద్భుత ట్యాక్లింగ్‌తో గుజరాత్‌ ఆలౌటైంది. అప్పటికి 9-5 ఆధిక్యంలో ఉన్న టైటాన్స్‌ అదే జోరు కొనసాగించి... తొలి అర్ధభాగాన్ని 17-13తో ముగించింది. ఇక రెండో సగంలోనూ టైటాన్స్‌ ఆటగాళ్లు అదే ఊపు కనబర్చారు. అయితే 26-20తో ముందంజలో ఉన్న సమయంలో గుజరాత్‌ వరుసగా మూడు పాయింట్లు సాధించి ఉత్కంఠ పెంచినా టైటాన్స్‌నే విజయం వరించింది. మరోమ్యాచ్‌లో హర్యానా 33-30తో బెంగళూరుపై గెలిచింది.

-పీకేఎల్‌లో నేడు


-బెంగాల్‌ x తెలుగు టైటాన్స్‌ 7.30గం.
-యూపీ x బెంగళూరు 8.30గం.

758

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles