క్రామ్నిక్ శిక్షణకు అర్జున్, భరత్‌కోటి


Wed,August 14, 2019 01:30 AM

Harsha
చెన్నై: ప్రపంచ మాజీ చెస్ చాంపియన్, గ్రాండ్ మాస్టర్ వ్లాదిమిర్ క్రామ్నిక్ శిక్షణకు తెలంగాణ గ్రాండ్‌మాస్టర్లు అర్జున్ ఇరిగేసి, హర్ష భరత్‌కోటి సహా భారత్ నుంచి ఆరుగురు ఆటగాళ్లు ఎంపికయ్యారు. ఇందులో గ్రాండ్‌మాస్టర్లు గుకేశ్, ప్రజ్ఞానంద, ఇనియాన్, ఇంటర్నేషనల్ మాస్టర్లు రౌనక్ సాధ్వానీ, లీయోన్ మెండోన్క ఉన్నారు. 12 నుంచి 16 ఏండ్ల లోపు ఉన్న వీరంతా క్రామ్నిక్ ఆధ్వర్యంలో ఈనెల 14 నుంచి 25 వరకు స్విట్జర్లాండ్‌లో ప్రత్యేక శిక్షణ పొందుతారని నిర్వాహకులు మంగళవారం పేర్కొన్నారు. యువ ఆటగాళ్లను మరింత సానబెట్టాలనే ఉద్దేశంతో మైక్రోసెన్స్ గ్లోబల్ టెక్నాలజీ సంస్థ సీఈవో సుజిత్ సింగ్ దీనికి పూనుకున్నారు. అద్భుత ప్రతిభ కల్గిన ఆటగాళ్లకు స్పాన్సర్ చేయాలనుకున్నాం. అందుకు తగ్గట్లు కొంత మందిని ఎంపిక చేసి ప్రపంచ మాజీ చాంపియన్ క్రామ్నిక్‌తో శిక్షణ కార్యక్రమం ఏర్పాటు చేశాం. తొలుత భారత్‌లోనే అనుకున్నా..ఆ తర్వాత క్రామ్నిక్ ఉండే స్విట్జర్లాండ్‌లో శిక్షణకు నిర్ణయించాం అని సుజిత్ సింగ్ అన్నాడు.

235

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles