హైదరాబాద్ ఓటమి


Thu,November 7, 2019 02:54 AM

హైదరాబాద్, నమస్తే తెలంగాణ క్రీడా ప్రతినిధి: ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్‌ఎల్) ఆరో సీజన్‌లో హైదరాబాద్ ఎఫ్‌సీ మరో ఓటమి చవిచూసింది. బుధవారం జీఎంసీ బాలయోగి మైదానంలో జరిగిన మ్యాచ్‌లో ఆతిథ్య జట్టు 0-1తేడాతో నార్త్‌ఈస్ట్ యునైటెడ్ ఎఫ్‌సీ చేతిలో పరాజయం పాలైంది. తొలి నుంచి ఇరు జట్లు హోరాహోరీగా తలపడడంతో గోల్ నమోదు కాలేదు. ఫస్ట్‌హాప్‌లో హైదరాబాద్ దూకుడు కనబరిచినా ఫలితం లేకపోయింది. అయితే మ్యాచ్ ముగియడానికి నాలుగు నిమిషాల ముందు నార్త్‌ఈస్ట్ ఆటగాడు మాక్సిమిలానో బెరీరో గోల్ చేయడంతో హైదరాబాద్ ఎఫ్‌సీకి ఓటమి తప్పలేదు.

149

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles