దక్షిణాఫ్రికా క్లీన్‌స్వీప్


Tue,January 15, 2019 04:25 AM

పాకిస్థాన్‌పై 3-0తో టెస్ట్ సిరీస్ కైవసం
Team-South-Africa
జొహాన్నెస్‌బర్గ్: పాకిస్థాన్‌తో మూడు టెస్ట్‌ల సిరీస్‌ను దక్షిణాఫ్రికా క్లీన్‌స్వీప్ చేసింది. సోమవారం ముగిసిన మూడో టెస్ట్‌లో సఫారీలు 107 పరుగుల తేడాతో పాక్‌పై ఘనవిజయం సాధించారు. దక్షిణాఫ్రికా నిర్దేశించిన 381 పరుగుల లక్ష్యఛేదనలో ఓవర్‌నైట్ స్కోరు 153/3తో నాలుగో రోజు ఆట కొనసాగించిన పాక్..ఒలీవర్(3/74), రబాడ(3/75) ధాటికి 273 పరుగులకు ఆలౌటైంది. సఫారీల కట్టుదిట్టమైన బౌలింగ్ ధాటికి పాక్ 120 పరుగుల తేడాతో మిగిలిన ఏడు వికెట్లు కోల్పోయింది. ఓవర్‌నైట్ బ్యాట్స్‌మన్ బాబర్ ఆజమ్(21)ను ఒలీవర్ వెనుకకు పంపించగా, కెప్టెన్ సర్ఫరాజ్ అహ్మద్(0) డకౌట్‌గా వెనుదిరిగాడు. అసద్ షఫీక్(65) అర్ధసెంచరీతో ఆకట్టుకోగా, షాదాబ్‌ఖాన్(47 నాటౌట్) రాణించాడు. డీకాక్‌కు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ దక్కగా, 24 వికెట్లు తీసిన ఒలీవర్ మ్యాన్ ఆఫ్ ద సిరీస్‌గా నిలిచాడు.

364

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles