ప్రధాన మంత్రులను అడగండి


Fri,October 18, 2019 03:35 AM

-పాక్‌తో ద్వైపాక్షిక సిరీస్‌పై దాదా
ganguly
కోల్‌కతా: బీసీసీఐ కొత్త అధ్యక్షుడిగా పదవీ బాధ్యతలు చేపట్టనున్న టీమ్‌ఇండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ తొలిసారి పాకిస్థాన్ సిరీస్‌పై పెదవి విప్పాడు. భారత్, పాకిస్థాన్ ద్వైపాక్షిక క్రికెట్ సంబంధాలపై తన అభిప్రాయాలు వెల్లడించాడు. చిరకాల ప్రత్యర్థుల మధ్య సిరీస్‌లు కొనసాగాలంటే ఇరు దేశాల ప్రధానుల అనుమతి అవసరమని పేర్కొన్నాడు. పాక్‌తో క్రికెట్ పునరుద్ధరణపై విలేకరులు అడిగిన ప్రశ్నకు బదులుగా ఈ ప్రశ్న మీరు మోదీజీ, పాక్ ప్రధానమంత్రిని అడగాలి. సిరీస్‌లు జరుగాలంటే ప్రభుత్వ అనుమతి తప్పనిసరి. అంతర్జాతీయ పర్యటనలు అన్నీ ప్రభుత్వ అంగీకారంతోనే సాగుతాయి. అందుకే దీనికి నేను సమాధానం చెప్పలేను అని దాదా అన్నాడు. భారత్, పాక్ మధ్య చివరిసారిగా 2012లో ద్వైపాక్షిక సిరీస్ జరిగింది. అందులో భాగంగా ఇరుజట్లు రెండు టీ20లు, 3 వన్డేలు ఆడాయి. పుల్వామా ఉగ్రదాడి అనంతరం ఇరుదేశాల మధ్య సంబంధాలు మరింత క్షీణించిన విషయం తెలిసిందే.

465

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles