ఫైనల్లో సిక్కి జోడీ


Sun,August 11, 2019 01:47 AM

Ponnappa

-హైదరాబాద్ బ్యాడ్మింటన్ ఓపెన్

హైదరాబాద్, నమస్తే తెలంగాణ ఆట ప్రతినిధి: స్థానిక గచ్చిబౌలి స్టేడియం వేదికగా జరుగుతున్న హైదరాబాద్ బ్యాడ్మింటన్ ఓపెన్‌లో రాష్ట్ర యువ షట్లర్ సిక్కిరెడ్డి, అశ్విని పొనప్పతో కలిసి ఫైనల్లోకి దూసుకెళ్లింది. శనివారం జరిగిన మహిళల డబుల్స్ సెమీఫైనల్లో సిక్కి, అశ్విని జోడీ 21-12, 21-12 తేడాతో హాంకాంగ్ ద్వయం ఫన్ క యన్, వు యి తింగ్‌పై అలవోక విజయం సాధించింది. అర్ధగంటలోపే ముగిసిన మ్యాచ్‌లో సిక్కి, అశ్విని తమదైన శైలిలో ప్రత్యర్థిపై పూర్తి ఆధిపత్యం చెలాయించారు. కండ్లు చెదిరే స్మాష్‌లకు తోడు డ్రాప్ షాట్లు, నెట్‌గేమ్‌తో హాంకాంగ్ జోడీని ఆటాడుకున్నారు. ఏ మాత్రం అవకాశమివ్వకుండా వరుస పాయింట్లతో వరుస గేముల్లో మ్యాచ్‌ను తమ వశం చేసుకుని ఈ సీజన్‌లో తొలిసారి ఫైనల్లోకి ప్రవేశించారు. ఆదివారం జరిగే తుది పోరులో సిక్కి, అశ్విని జోడీ కొరియాకు చెందిన బయిక్ హానా, జంగ్ క్యుంగ్‌తో తలపడుతుంది. పురుషుల సింగిల్స్‌లో సౌరభ్ వర్మ ఫైనల్లోకి ప్రవేశించాడు. శనివారం నాటి సెమీస్‌లో సౌరభ్ 23-21, 21-16తో ఇస్కందర్ జుల్కరనైన్(మలేషియా)పై విజయం సాధించాడు. 48 నిమిషాల్లోనే సౌరభ్.. ఇస్కందర్‌ను మట్టికరిపించాడు. ఆదివారం ఫైనల్లో సౌరభ్.. లోహ్ కీన్ యు(సింగపూర్)తో ఆడుతాడు.

269

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles