ఒక్క పరుగివ్వకుండానే ఆరువికెట్లు


Tue,December 3, 2019 01:34 AM

-నేపాల్‌ క్రికెటర్‌ సంచలన రికార్డు
chand
కఠ్మాండు (నేపాల్‌ ) : నేపాల్‌ మహిళా బౌలర్‌ అంజలీ చందా మహిళల అంతర్జాతీయ టీ20ల్లో కొత్త చరిత్ర సృష్టించింది. 13వ దక్షిణాసియా గేమ్స్‌లో భాగంగా మాల్దీవులతో సోమవారం జరిగిన మ్యాచ్‌లో అంజలీ ఒక్కపరుగు కూడా ఇవ్వకుండా ఆరు వికెట్లు తీసింది. ఈ ఘనత సాధించిన తొలి మహిళా క్రికెటర్‌గా రికార్డును తన పేరిట లిఖించుకుంది. దీంతో నేపాల్‌ 5 బంతుల్లోనే 10 వికెట్ల తేడాతో 17 పరుగులు చేసి గెలుపొందింది. అంజలీ నిప్పులు చెరిగి పరుగులేమీ ఇవ్వకుండా ఆరుగురిని పెవిలియన్‌ చేర్చడంతో తొలుత టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న మాల్దీవులు జట్టు 10.1 ఓవర్ల ఆడి 16 పరుగులే చేయగలిగింది. ఎనిమిది మంది పరుగుల ఖాతా కూడా తెరువలేకపోయారు. స్వల్ప లక్ష్యాన్ని నేపాల్‌ ఐదు బంతుల్లోనే సాధించింది. ఐదు బంతుల్లోనూ మాల్దీవుల బౌలర్‌ ఐదు ఎక్స్‌ట్రాలు సమర్పించుకుంది. అంతకు ముందు మహిళా క్రికెట్‌లో మలేసియా క్రీడాకారిణి మాస్‌ ఎలీసా (6/3) పేరిట అత్యత్తుమ బౌలింగ్‌ ప్రదర్శన రికార్డు ఉండేది.

354
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles