విజయానికి వికెట్ దూరంలో..


Thu,September 12, 2019 04:19 AM

తిరువనంతపురం: దక్షిణాఫ్రికా-ఏతో జరుగుతున్న తొలి అనధికారిక టెస్టులో భారత్-ఏ విజయానికి చేరువైంది. వర్షం కారణంగా మూడోరోజు కేవలం 20 ఓవర్ల ఆటే సాగగా.. దక్షిణాఫ్రికా-ఏ జట్టు రెండో ఇన్నింగ్స్‌లో 55 ఓవర్లలో 9 వికెట్లకు 179 పరుగులు చేసింది. ప్రస్తుతం చేతిలో ఒక్క వికెట్ మాత్రమే ఉన్న సఫారీలు 40 పరుగుల ఆధిక్యంలో ఉన్నారు. బుధవారం రెండు గంటలకంటే తక్కువే జరిగిన ఆటలో భారత్ 4 వికెట్లు పడగొట్టింది. ఓవర్‌నైట్ స్కోరు 125/5తో మూడోరోజు రెండో ఇన్నింగ్స్ కొనసాగించిన సఫారీలు.. 54 పరుగులు జోడించారు. క్లాసెన్ (48) క్రితం రోజు స్కోరుకు మరో 13 పరుగులు జతచేసి ఔట్‌కాగా.. మల్డర్ (46) ఫర్వాలేదనిపించాడు. భారత బౌలర్లలో స్పిన్నర్లు షాబాజ్ నదీమ్ (3/17), జలజ్ సక్సేనా (2/22) ఆకట్టుకున్నారు. దక్షిణాఫ్రికా-ఏ తొలి ఇన్నింగ్స్‌లో 164 పరుగులకు ఆలౌట్ కాగా.. భారత్ 303 పరుగులు చేసిన విషయం తెలిసిందే.

489

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles