టెస్టుల్లో ఓపెనర్‌గా రోహిత్!


Thu,September 12, 2019 04:55 AM

దక్షిణాఫ్రికా సిరీస్‌కు జట్టు ఎంపిక నేడు
Rohit-Sharmaa
న్యూఢిల్లీ: టెస్టుల్లో కేఎల్ రాహుల్ వరుస గా విఫలమవుతుండడంతో సుదీర్ఘ ఫార్మాట్‌లో ఓపెనర్‌గా రోహిత్ శర్మ వైపే సెలెక్టర్లు మొగ్గు చూపే అవకాశం కనిపిస్తున్నది. వచ్చే నెల దక్షిణాఫ్రికాతో స్వదేశంలో జరిగే మూడు టెస్టుల సిరీస్ కోసం జట్టును ఎం పిక చేసేందుకు గురువారం ఇక్కడ ఎమ్మె స్కే ప్రసాద్ నేతృత్వంలోని సెలెక్షన్ కమిటీ సమావేశం కానుంది. 5,6 స్థానాల్లో తెలు గు ప్లేయర్ హనుమ విహారి, అజింక్య రహా నే అదరగొడుతుండటంతో రోహిత్‌ను సఫారీ సిరీస్‌కు ఓపెనర్‌గానే తీసుకునే చాన్స్ ఉంది. 2018లో ఆస్ట్రేలియాతో హిట్‌మ్యాన్ చివరిసారిగా ఐదు రోజుల ఫార్మాట్‌లో బరిలోకి దిగాడు. సెహ్వాగ్‌లా టెస్టుల్లోనూ ధాటిగా ఆడే ప్లేయర్‌గా రోహిత్‌ను ప్రయోగించాలని కోచ్ రవిశాస్త్రి ఆలోచనగా తెలుస్తున్నది.

మరో ఓపెనర్‌గా మయాంక్ అగర్వాల్‌కు చోటు ఖాయం. ఒకవేళ రాహుల్‌ను తప్పించాల్సి వస్తే దేశవాళీ క్రికెట్‌లో అదరగొడుతున్న బెంగాల్ ఓపెనర్ అభిమన్యు ఈశ్వరన్‌కు జట్టులో చోటు దక్కే అవకాశాలు మెండుగా ఉన్నాయి. ప్రియాంక్ పంచల్, శుభ్‌మన్ గిల్ కూడా రేసులో ఉన్నారు. ఇక మూడో స్థానంలో పుజార, నాలుగో స్థానంలో కోహ్లీ ఉంటారు. పేసర్లుగా బుమ్రా, షమీ, ఇషాంత్... స్పిన్నర్లు జడేజా, కుల్‌దీప్, అశ్విన్‌కు జట్టులో చోటు దక్కనుంది.

760

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles