ప్రదీప్ చేతిలో ఓడిన తలైవాస్


Tue,September 10, 2019 02:32 AM

pkl
కోల్‌కతా: డుబ్కీ కింగ్ ప్రదీప్ నర్వాల్ ఆకాశమే హద్దుగా చెలరేగిపోవడంతో ప్రొ కబడ్డీ లీగ్‌లో పాట్నా పైరేట్స్ 51-25తో తమిళ్ తలైవాస్‌పై ఘనవిజయం సాధించింది. తమిళ తంబీలంతా కలిసి 25 పాయింట్లు సాధిస్తే.. ప్రదీప్ నర్వాల్ ఒక్కడే 26 పాయింట్లు సాధించడం విశేషం. తలైవాస్ తరఫున స్టార్ రైడర్ రాహుల్ చౌదరి (5 పాయింట్లు) పెద్దగా ఆకట్టుకోలేకపోగా.. అజిత్ కుమార్ (10 పాయింట్లు) సూపర్-10 సాధించాడు. రైడింగ్‌లో కాస్త ఫర్వాలేదనిపించిన తలైవాస్.. ట్యాక్లింగ్‌లో ఘోరంగా విఫలమైంది.ప్రదీప్ వన్ మ్యాన్ షోతో రెచ్చిపోవడంతో.. తంబీలను నాలుగు సార్లు ఆలౌట్ చేసిన పాట్నా అలవోకగా మ్యాచ్‌ను సొంతం చేసుకుంది. మరో మ్యాచ్‌లో యూపీ యోధా 33-26తో గుజరాత్ ఫార్చూన్ జెయింట్స్‌పై విజయం సాధించింది.

337

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles