రవిశాస్త్రి వేతనం 10 కోట్లు!


Tue,September 10, 2019 02:26 AM

Ravi-Shastri
ముంబై : టీమ్‌ఇండియా ప్రధాన కోచ్‌గా మరో రెండేండ్ల పాటు కాంట్రాక్టు పొందిన రవిశాస్త్రి వేతనం భారీగా పెరగనుందని సమాచారం. ప్రస్తుతం అతడి వేతనం ఏడాదికి రూ.8కోట్లు కాగా 20శాతం పెరిగి రూ.9.5కోట్ల నుంచి రూ.10 కోట్లకు చేరనుంది. అలాగే, సహాయక సిబ్బంది జీతాలు భారీగానే పెరగనున్నాయి. బౌలింగ్ కోచ్ భరత్ అరుణ్‌కు ఏడాదికి రూ.3.5కోట్లు, బ్యాటింగ్ కోచ్ విక్రమ్ రాథోడ్‌కు రూ.2.5 కోట్ల నుంచి రూ.3 కోట్ల వరకు వేతనం పెరగనుంది. చీఫ్ కోచ్ నియామకం కోసం ఇంటర్వ్యూలు నిర్వహించిన కపిల్ దేవ్ నేతృత్వంలోని క్రికెట్ సలహాదారుల కమిటీ మరోసారి రవిశాస్త్రినే రెండేండ్ల కాలానికి ఎంపిక చేసిన విషయం తెలిసిందే.

యువకులపై దృష్టిసారిస్తున్నాం

టెస్టు చాంపియన్‌షిప్, వచ్చే ఏడాది జరిగే టీ20 ప్రపంచకప్ నేపథ్యంలో యువ ఆటగాళ్లపై ఎక్కువ దృష్టి సారిస్తున్నామని టీమ్‌ఇండియా చీఫ్ కోచ్ రవిశాస్త్రి సోమవారం వెల్లడించాడు. కొత్త ఆటగాళ్లు జట్టులోకి వస్తున్నారు. సీనియర్లు, జూనియర్లతో పటిష్ఠమైన జట్టును తయారు చేయడం ఎంతో ము ఖ్యం. మూడు ఫార్మాట్లలో బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో బెంచ్ బలాన్ని పెంచుకోవాలని భావిస్తున్నాం అని శాస్త్రి చెప్పాడు.

602

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles