టాప్‌పై కన్నేసిన కివీస్


Wed,August 14, 2019 01:47 AM

Kiwis
- నేటి నుంచి లంకతో తొలిటెస్టు

గాలె: వన్డే ప్రపంచకప్ ఫైనల్లో గెలుపు అంచులదాక వెళ్లి రన్నరప్‌తో సరిపెట్టుకున్న న్యూజిలాండ్ నెలరోజుల విశ్రాంతి అనంతరం తొలిసారి మైదానంలో దిగనుంది. ఓవైపు భారత్, వెస్టిండీస్ వన్డే సిరీస్.. మరోవైపు ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ మధ్య యాషెస్ సిరీస్ కొనసాగుతుండగా.. శ్రీలంకతో టెస్టు సిరీస్‌కు కివీస్ రెడీ అయింది. బుధవారం నుంచి ప్రారంభమయ్యే రెండు టెస్టుల సిరీస్‌ను గెలుచుకొని టెస్టుల్లో టాప్ ప్లేస్‌కు వెళ్లడంతో పాటు ఐసీసీ ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ (డబ్ల్యూటీసీ)లో కీలక పాయింట్లు ఖాతాలో వేసుకోవాలని భావిస్తున్నది. ప్రస్తుతం 109 పాయింట్లతో భారత్ (113) తర్వాత రెండో స్థానంలో ఉన్న బ్లాక్ క్యాప్స్ రెండు టెస్టుల్లోనూ గెలిస్తే.. టీమ్‌ఇండియాను వెనక్కి నెట్టి అగ్రస్థానానికి చేరే చాన్స్ ఉంది.

సొంతగడ్డపై శ్రీలంకకు స్పిన్నే ప్రధానాయుధం కాగా.. ఆ బలంతోనే లంకేయులను పడగొట్టాలని న్యూజిలాండ్ భావిస్తున్నది. లెఫ్టార్మ్ స్పిన్నర్ ఎజాజ్ పటేల్‌తో పాటు టాడ్ ఆస్టల్‌ను ఎదుర్కోవడం లంక బ్యాట్స్‌మన్‌కు పరీక్షే. ట్రెంట్ బౌల్ట్, టీమ్ సౌథీతో పాటు ఆల్‌రౌండర్ కొలిన్ గ్రాండ్‌హోమ్ పేస్ భారాన్ని మోయనున్నారు. బ్యాటింగ్‌లో కెప్టెన్ విలియమ్సన్‌తో పాటు రాస్ టేలర్, లాథమ్, నికోల్స్, రావెల్ కీలకం కానున్నారు. మరోవైపు ఈ ఏడాది ఆరంభంలో దక్షిణాఫ్రికా గడ్డపై 2-0తో టెస్టు సిరీస్ నెగ్గిన లంక అదే ఊపులో సొంతగడ్డపై కివీస్‌ను బోల్తాకొట్టించాలని అనుకుంటున్నది.

482

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles