కాంస్య పోరుకు నవీన్


Tue,September 17, 2019 04:21 AM

naveen
నూర్-సుల్తాన్ (కజకిస్థాన్): ప్రపంచ రెజ్లింగ్ చాంపియన్‌షిప్‌లో తొలి రెండు రోజు లు నిరాశపరిచిన భారత రెజ్లర్లు మూడో రోజు సత్తాచాటారు. నవీన్ (130 కేజీలు) గ్రీకో రోమన్ విభాగంలో కాంస్య పతక పోరుకు అర్హత సాధించాడు. తొలుత నవీన్.. ఆస్కార్ పినో హిండ్స్ (క్యూబా) చేతిలో ఓటమి పాలయ్యా డు. అయితే.. క్యూబా రెజ్లర్ ఫైనల్ చేరడంతో రెప్‌చేజ్ రూపంలో నవీన్‌కు మరో అవకాశం దక్కింది. ఈసారి పట్టువదలకుండా ప్రయత్నించిన నవీన్.. హైకీ నబీ (ఎస్తోనియా), మురా త్ (కిర్గిస్థాన్)పై గెలిచి కాంస్య పతక పోరుకు చేరాడు. 77 కేజీల విభాగంలో గురుప్రీత్ సింగ్ ఆరంభంలో అదరగొట్టినా మూడో బౌట్‌లో ప్రపంచ మాజీ చాంపియన్ విక్టర్ నెమ్స్ (సెర్బియా) చేతిలో ఓడాడు. 60 కేజీల విభాగంలో మనీశ్.. విక్టర్ బాను (మాల్దోవా) చేతిలో ఓడి టోర్నీ నుంచి వైదొలిగాడు.

232

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles