తెలంగాణకు మూడో స్థానం


Tue,September 17, 2019 04:17 AM

target-ball
వర్ని: నిజామాబాద్ జిల్లా చందూర్ మండల కేంద్రంలో జాతీయస్థాయి జూనియర్ టార్గెట్‌బాల్ పోటీలు సోమవారం ముగిశాయి. హోరాహోరీగా సాగిన టోర్నీ బాలుర విభాగంలో ఆంధ్రప్రదేశ్ 10-3 తేడాతో ఉత్తర్‌ప్రదేశ్‌పై విజయం సాధించగా, బాలికల తుదిపోరులో హర్యానా 4-2తో ఆంధ్రప్రదేశ్‌ను ఓడించి విజేతగా నిలిచింది. అయితే బాలుర సెమీఫైనల్లో బిహార్‌పై తెలంగాణ 11-1తో గెలిచి మూడో స్థానాన్ని సొంతం చేసుకుంది. బాలికల కేటగిరీలో మూడో స్థానం కోసం జరిగిన పోరులో రాజస్థాన్‌పై 7-5తో గెలిచిన తెలంగాణ మూడో స్థానంలో నిలిచింది. క్రీడల ముగింపు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బోధన్ ఆర్డీవో గోపీరాం హాజరై విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో టార్గెట్‌బాల్ ఫౌండర్, జాతీయ కార్యదర్శి సోనుశర్మ, అధ్యక్షుడు వినోద్ కుమార్, సంయుక్త కార్యదర్శి సురేశ్ కుమార్, తాసిల్దార్ నారాయణ తదితరులు పాల్గొన్నారు.

465

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles