ఐపీఎల్ మ్యాచ్‌కు ముందు జాతీయ గీతం


Fri,November 8, 2019 02:18 AM

బీసీసీఐకి పంజాబ్ ప్రతిపాదన
న్యూఢిల్లీ : ఐపీఎల్లో జరిగే ప్రతి మ్యాచ్‌కు ముందు జాతీయ గీతం ఆలపించే విధానాన్ని వచ్చే సీజన్‌లో ప్రవేశపెట్టాలని కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్టు బీసీసీఐని కోరింది. ఈ మేరకు పంజాబ్ సహ యజమాని నెస్ వాడియా బీసీసీఐకి గురువారం లేఖ రాశాడు. ప్రతి అంతర్జాతీయ మ్యాచ్‌కు ముందు జాతీయ గీతం ఆలపించే సంప్రదాయం కొనసాగుతున్నందున ఐపీఎల్‌లోనూ ఈ విధానం ప్రవేశపెట్టాలని కోరాడు. ఎంతో ఖర్చుతో కూడుకున్న ఐపీఎల్ ప్రారంభ వేడుకలను రద్దు చేసే ఆలోచనను అతడు సమర్థించాడు. ప్రారంభ వేడుక అవసరమేంటని నేనెప్పుడూ ఆలోచిస్తుండేవాడిని. దాన్ని రద్దు చేయడం మంచి నిర్ణయం. అలాగే ఐపీఎల్‌లో ప్రతీమ్యాచ్‌కు ముందు జాతీయ గీతాలాపన ఉండాలి. నేను ఇంతకు ముందు కూడా ఈ విషయమై బీసీసీఐకి లేఖలు రాశా. ఇప్పుడు అధ్యక్షుడిగా ఉన్న గంగూలీకి లేఖను పంపా. సినిమా థియేటర్లలోనూ జాతీయ గీతాన్ని ప్లే చేస్తున్నారని అనుకుంటున్నా అని నెస్ వాడియా చెప్పాడు.

424

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles