నాదల్‌దే మాంట్రియల్


Tue,August 13, 2019 01:41 AM

Nadal
మాంట్రియల్ : స్పెయిన్ బుల్ రఫెల్ నాదల్ మరోసారి సత్తాచాటాడు. సోమవారమిక్కడ జరిగిన ఫైనల్లో 6-3, 6-0 తేడాతో డేనిల్ మెద్వెదెవ్(రష్యా)పై గెలిచి మాంట్రియల్ టైటిల్‌ను కైవసం చేసుకున్నాడు. తన కెరీర్‌లో మొత్తంగా 35వ ఏటీపీ సింగిల్స్ మాస్ట ర్స్ 1000 టైటిల్‌ను చేజిక్కుంచుకొని రికార్డును మెరుగుపరుచుకున్నాడు. 33 టైటిళ్లతో జొకోవిచ్ రెండో స్థానంలో ఉన్నాడు. 70 నిమిషాల పాటు సాగిన ఫైనల్లో నాదల్ విశ్వరూపాన్ని చూపాడు. మొదటి నుంచి బలమైన షాట్లతో విరుచుపడుతూ ప్రత్యర్థి డేనిల్‌కు చుక్కలు చూపాడు.

326

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles